Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
ఇన్ని పోషకాలున్న లడ్డును ఎప్పుడూ చూసుండరు..జుట్టుకి, చర్మ మెరుపుకి కేక..ఎలా చేసుకోవాలంటే..
జుట్టు రాలడం, చర్మంపై ముడతలు వంటి సమస్యలన్నింటికీ వంటింట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే అవిసె గింజల లడ్డు. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని అరికడతాయి.
అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ లడ్డులో వాడే నువ్వులు, బాదం, వాల్ నట్స్, బెల్లం వంటివి శరీరానికి కావాల్సిన జింక్, ఐరన్, కాల్షియంను అందిస్తాయి. అవిసె గింజల లడ్డును ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
తామర గింజలు (ఫూల్ మఖానా) - 1 కప్పు
అవిసె గింజలు - 1 కప్పు
తెల్ల నువ్వులు - పావు కప్పు
బాదం పప్పులు - అర కప్పు
వాల్నట్స్ - పావు కప్పు
ఎండు కొబ్బరి తురుము - అర కప్పు
ఎండు ద్రాక్ష (కిస్మిస్) - పావు కప్పు
బెల్లం పొడి/తురుము - ముప్పావు కప్పు
ఏలకుల పొడి - అర టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
నీళ్లు - పావు కప్పు
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో మఖానా వేసి, అవి క్రిస్పీగా గట్టిగా అయ్యే వరకు సుమారు 3 నిమిషాల పాటు దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో ఒక కప్పు అవిసె గింజలు వేసి వేయించండి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు, 2 నిమిషాల తర్వాత పావు కప్పు తెల్ల నువ్వులు కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించి వీటిని కూడా పక్కన ప్లేట్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు బాదం, వాల్ నట్స్ ను పాన్ లో వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. చివరగా ఎండు కొబ్బరి తురుము,ఎండు ద్రాక్షలను వేసి కేవలం ఒక నిమిషం పాటు వేయించి తీసేయండి.
-అదే పాన్ లో ముప్పావు కప్పు బెల్లం తురుము వేసి అందులో పావు కప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగి నీళ్ళలో కలిసే వరకు మరిగిస్తే చాలు తీగ పాకం రానవసరం లేదు. బెల్లం కరిగాక స్టవ్ ఆఫ్ చేయండి.
-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న అవిసె గింజలు, నువ్వులు వేసి మెత్తగా పొడి చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత తామర గింజలు, బాదం, వాల్నట్స్, కొబ్బరి మిశ్రమాన్ని కూడా మిక్సీలో వేసి కొంచెం బరకగా పొడి చేసుకుని అదే గిన్నెలో వేసుకోండి.
-ఇప్పుడు ఈ పొడి మిశ్రమంలో అర చెంచా ఏలకుల పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి చేత్తో బాగా కలపండి. చివరగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీటిని వడకట్టి కొద్ది కొద్దిగా వేస్తూ కలపండి. మిశ్రమం వేడిగా ఉన్నప్పుడే మీకు నచ్చిన సైజులో గుండ్రని లడ్డూలుగా చుట్టుకోండి.
-అంతే అవిసె గింజల లడ్డూలు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే 15 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
-రోజుకొక లడ్డు తినడం ద్వారా మీ జుట్టు, చర్మ సమస్యలే కాకుండా, కీళ్ల నొప్పులు కూడా తగ్గి, రోజంతా ఉల్లాసంగా ఉంటారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications






