Latest Updates
-
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్‌విచ్‌లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.!
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.!
పూరీలు అంటే ఇంట్లో గోధుమ పిండితో చేస్తాం. ఇక హోటల్‌లో తింటే అక్కడ పక్కా మైదా పిండితో చేసిన పూరీలే తినాల్సి వస్తుంది. కానీ ఎప్పుడైనా బియ్యం పిండితో పూరీలు ట్రై చేశారా..? బియ్యంతో పూరీలు ఏంటని అనుకుంటున్నారా.. గోధుమ పిండితో పోలిస్తే ఇలా చేయడమే చాలా ఈజీ. బాగా పొంగుతూ, మల్లపువ్వు మాదిరిగా తెల్లగా, చూడగానే నోరూరించే ఈ రైస్ పూరీలను తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఒక్కసారి ట్రై చేశారంటే మాత్రం ప్రతిసారీ ఇలాగే చేసుకోవాలనేంత రుచిగా ఉంటాయి. రైస్ పూరీలను ఎలా తయారు చేయాలో చూద్దాం..

రైస్ పూరీ తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు
అటుకులు- అర కప్పు
నీళ్లు- ముప్పావు కప్పు
ఉప్పు- రుచికి సరిపడా
నూనె- డీప్ ఫ్రైకి సరిపడా
రైస్ పూరీ తయారీ విధానం
ఆరోగ్య సిరి ఉసిరితో 'స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్‌విచ్‌లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
ముందుగా బౌల్‌లోకి బియ్యం తీసుకుని రెండుసార్లు కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. సాయంత్రం స్నాక్స్ కోసం చేసుకుంటే నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి అయితే రాత్రంతా నానబెట్టుకుంటే మంచిది.
నానిన తర్వాత బియ్యంలోని నీటిని తీసేయాలి. ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టిన అటుకులను బియ్యంలో కలిపి మిక్సీ జార్‌లో వేసుకుని ముప్పావు కప్పు నీళ్లు పోసుకుని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి.

పిండి ఎంత మెత్తగా ఉంటే పూరీలు అంత పొంగుతూ, సాఫ్ట్‌గా వస్తాయి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఫొటోలో చూపించిన మాదిరిగా అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు.. మరీ లూజ్‌గా ఉండకూడదు.
తర్వాత స్టవ్‌పైన కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక హై ఫ్లేమ్‌లోనే ఉంచాలి. గరిటెతో పిండి తీసుకుని నూనెలో ఒకే చోట బూరెలు మాదిరిగా వేసుకోవాలి. తర్వాత వెంటనే కలపకూడదు.
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
పూరీ అక్కడే ఉడుకుతూ పొంగుతూ పైకి వస్తుంది. అప్పుడు చిల్లుల గరిటెతో రెండో వైపులను తిప్పుకొని కాల్చుకోవాలి. బియ్యం పూరీలు కాబట్టి ఇవి ఎర్రగా కాలవు. పూరీలు రెండు వైపులా పచ్చిదనం లేకుండా బాగా కాలాయని నిర్ధారించుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి.
మిగతా పిండిని కూడా అదేమాదిరిగా పూరీలు చేసుకోవాలి. అంతే టేస్టీ రైస్ పూరీలు రెడీ. వీటిని ఉల్లి టమాటా చట్నీతో తింటే స్పైసీగా అద్భుతంగా ఉంటుంది. ఈ సారి బ్రేక్‌ఫాస్ట్ లేదా స్నాక్స్‌లోకి ఈ రైస్ పూరీలను తప్పకుండా ట్రై చేయండి. ఈ పూరీల్లోకి రేషన్ బియ్యం లేదా సోనా మసూరి బియ్యం కూడా వాడుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
