ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్‌ జామ్‌’.. బ్రెడ్‌, శాండ్‌విచ్‌లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!

ఉసిరికాయల సీజన్‌ వచ్చేసింది. మార్కెట్‌లో నిగనిగలాడుతూ నోరూరిస్తుంటుంది. తినేటప్పుడు వగరుగా ఉన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ ఉసిరి ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. అందుకే దీనిని ఆరోగ్య సిరిగా పిలుస్తారు. సీజనల్‌ వ్యాధుల నుంచి కాపాడే ఆమ్ల గుణాలు ఉన్న ఈ ఉసిరిని సీజన్‌లో రోజుకి ఒకటైనా తినాలని డాక్టర్లు సూచిస్తారు. మరి అలాంటి ఉసిరితో ఇంట్లోనే జామ్‌ చేసుకుంటే.. సీజన్‌ ఉన్నంత వరకు కాదు.. సంవత్సరం వరకు వీటి రుచిని ఆస్వాదించవచ్చు. బ్రెడ్‌, శాండ్‌విచ్‌, చపాతీల్లోకి టొమాటో కెచప్‌కి బదులుగా తీసుకోవచ్చు. పిల్లలు ఉసిరి తినమని మారాం చేస్తే ఇలా జామ్‌ చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ తినేస్తారు.

Healthy sweet recipe amla jam for bread and sandwich prepare easily at home

ఆమ్లా జామ్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఉసిరికాయలు- అరకేజీ
నీళ్లు- రెండు గ్లాసులు
బెల్లం- అర కేజీ
ఉప్పు- పావు టీస్పూన్‌
ఏలకుల పొడి- టీస్పూన్‌
మిరియాల పొడి- అర టీస్పూన్‌
నిమ్మరసం- మూడు టీస్పూన్లు
కారం- అర టీస్పూన్‌
నెయ్యి- టీస్పూన్‌

ఆమ్లా జామ్‌ తయారీ విధానం

అన్నం, రోటీల్లోకి బెస్ట్‌ ఎవర్‌ సైడ్‌ డిష్‌.. రాజస్థానీ ఫేమస్‌ పంచరత్న దాల్‌.!

ముందుగా అరకేజీ తాజా ఉసిరికాయలను తీసుకుని కడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పైన వెడల్పాటి గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి మరిగించుకోవాలి.

ఇప్పుడు జల్లెడలో ఉసిరికాయలు వేసి దానిని మరుగుతున్న నీళ్ల గిన్నెపై ఉంచాలి. ఉసిరికాయలపైన మూతపెట్టి 15 నిమిషాల పాటు ఆవిరిపైన ఉడికించుకోవాలి. మధ్యమధ్యలో మూత తీసి ఉసిరిని మరోవైపు తిప్పుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఉసిరికాయలు సమంగా మెత్తబడతాయి.

Healthy sweet recipe amla jam for bread and sandwich prepare easily at home

పావు గంట తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని పక్కనపెట్టుకోవాలి. వీటిని చల్లారనివ్వాలి. ఈ లోపు బెల్లం తురిమి పెట్టుకోవాలి.

ఉసిరికాయలు చల్లారిన తర్వాత గింజలు తీసేసి మెత్తగా ఉడికిన వాటిని సెపరేట్‌ చేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీంతో పాటు బెల్లం కూడా వేసుకుని మెత్తగా పేస్ట్‌ మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి.

గ్రైండ్‌ చేసుకున్న పేస్ట్‌ను నాన్‌స్టిక్‌ పాన్ లేదా స్టీల్‌ పాన్‌లోకి తీసుకోవాలి. స్టవ్‌పైన పెట్టి చిన్న మంటపైన తేమ మొత్తం పోయే వరకు కలుపుతూ ఉడికించాలి.

కొద్దిగా ఉప్పు, ఏలకుల పొడి, మిరియాల పొడి, నిమ్మరసం, కారం వేసి కలిపి చిన్న మంటపైనే కలుపుతూ ఉడికించుకోవాలి.

ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!

ఉసిరి చూర్ణం దగ్గరికి ఉడుకుతూ నీరంతా ఆవిరైపోతుంది. అప్పుడు నెయ్యి వేసి మరోసారి కలపాలి. ఈ స్వీట్‌ మొత్తం పాన్‌ నుంచి సెపరేట్‌ అవుతూ ఉడుకుతుంది. మిశ్రమం అంతా చిక్కబడి జామ్‌ లేదా హల్వా మాదిరిగా అయినప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి.

అంతే టేస్టీ అండ్‌ హెల్తీ ఉసిరి జామ్‌ రెడీ. చల్లారిన తర్వాత గాజు డబ్బాలో స్టోర్‌ చేసుకుని గట్టిగా మూత పెట్టుకోవాలి. బయట ఉంచితే రెండు లేదా మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెడితే సంవత్సరం పాటు ఉంటుంది.

ఈ ఆమ్లా జామ్‌ను చపాతీ, బ్రెడ్‌, శాండ్‌విచ్‌లోకి టమాటో కెచప్‌కి రీప్లేస్‌మెంట్‌గా తీసుకోవచ్చు. ఇంట్లోనే చేసుకోవడంతో కల్తీ జరగదు. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

[ of 5 - Users]
Story first published: Friday, September 25, 2026, 17:42 [IST]
Desktop Bottom Promotion