Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఐరన్, ఫైబర్ పుష్కలం.. ఆరోగ్యానికి అమృతం ఈ పాలకూర రోటీ..ఎలా చేసుకోవాలంటే..
పిల్లలకు ఆకుకూరలు తినిపించడం ప్రతి ఇంట్లో తల్లులకు ఒక పెద్ద సవాలే. ఆకుపచ్చ రంగు చూడగానే పిల్లలు ముఖం తిప్పేసుకుంటారు. కానీ మనం రోజూ తినే సాధారణ రోటీకి ఒక చిన్న సూపర్ ఫుడ్ ట్విస్ట్ ఇస్తే ఎలా ఉంటుంది? అదే కమ్మని, మృదువైన పాలకూర రోటీ. ఇది చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, తినడానికి అంతకంటే రుచిగా ఉంటుంది. అంతేకాదు గంటల తరబడి లంచ్ బాక్స్ లో ఉన్నా సరే మెత్తగానే ఉండటం దీని ప్రత్యేకత. పాలకూరలోని ఐరన్, గోధుమ పిండిలోని ఫైబర్ కలగలిసి దీనిని ఒక పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన ఫుడ్ గా మారుస్తాయి.

పాలకూర రోటీ తయారీకి కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
పాలకూర పేస్ట్: 1 కప్పు
నూనె: 1 టేబుల్ స్పూన్
గోరువెచ్చని నీళ్లు: పిండి కలపడానికి తగినన్ని
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి లేదా వెన్న: కాల్చిన రోటీలపై పూయడానికి

పాలకూర రోటీ తయారీ విధానం
-ముందుగా పాలకూర ఆకులను ఉడికించి తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఒక వెడల్పాటి గిన్నెలో గోధుమ పిండి తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్ వేసి కలపండి. ఇప్పుడు అవసరాన్ని బట్టి కొద్దికొద్దిగా గోరువెచ్చని నీళ్లు పోస్తూ ముద్దలా చేసుకోండి. పిండిని కనీసం 5 నిమిషాల పాటు చేతులతో బాగా మర్దన చేస్తూ కలపాలి. అప్పుడే రోటీలు అత్యంత మృదువుగా వస్తాయి.
-ఈ పిండిని సమాన పరిమాణంలో చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. అవి ఆరిపోకుండా ఉండటానికి ఒక తడి వస్త్రంతో కప్పి ఉంచండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి, పెనం (Tawa) పెట్టి మధ్యస్థ మంట మీద వేడి చేయండి.
-ఒక పిండి ఉండను తీసుకుని కొద్దిగా పొడి పిండి చల్లి పీట మీద మందంగా ఒత్తండి. మధ్యలో కాస్త నూనె లేదా పొడి పిండి రాసి మళ్లీ మడతపెట్టండి. ఇలా చేయడం వల్ల రోటీ పొరలు పొరలుగా, సాఫ్ట్ గా వస్తుంది.
-ఇప్పుడు దీన్ని గుండ్రంగా, పలుచగా రోటీలా ఒత్తుకోవాలి. అదనంగా ఉన్న పిండిని దులిపేసి, వేడిగా ఉన్న పెనం మీద ఈ రోటీని వేయండి.
-రోటీ పైన చిన్న బుడగలు రాగానే రెండో వైపుకు తిప్పండి. అడుగుభాగంలో లేత గోధుమ రంగు మచ్చలు వచ్చే వరకు సుమారు 30 సెకన్ల పాటు కాలనివ్వండి.
-ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంతో అంచుల వెంబడి మెల్లగా నొక్కుతూ ఉంటే రోటీ బంతిలా పొంగుతుంది. ఇలా పెనం మీద కాల్చడం వల్ల రోటీ అంచులు కూడా పచ్చిగా లేకుండా బాగా ఉడుకుతాయి.
-రెండు వైపులా బాగా కాలిన తర్వాత, ప్లేట్ లోకి తీసుకుని వేడివేడిగా ఉండగానే కాస్త నెయ్యి లేదా వెన్న రాయండి. మిగతా ఉండలను కూడా ఇదే విధంగా చేసుకోండి.
-అంతే నోరూరించే పాలకూర రోటీలు రెడీ. ఈ వేడివేడి రోటీలను మీకు ఇష్టమైన పనీర్ బటర్ మసాలా, దాల్ మఖానీ లేదా మరేదైనా గ్రేవీ కూరతో ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
