Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
ఇంట్లోనే బర్త్ డే కేక్..మైదా,చక్కెర,గుడ్లు లేకుండా..స్టవ్ మీదనే ఎలా చేసుకోవాలంటే
ఇంట్లో ఎవరిదైనా బర్త్ డే ఉంటే వెంటనే బేకరీకి వెళ్లి కేకు తెచ్చుకుంటారు చాలామంది. అయితే దీనికి బదులు ఇంట్లోనే ఈజీగా కేకును తయారుచేసుకోవడం ద్వారా ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేసినట్లు అవుతుంది. ఇంట్లో కేకు తయారీ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటదేమో అని చాలామంది భావిస్తారు. కానీ ఇది చాలా సులభం. అయితే మైదాపిండి,చక్కెర,బెల్లం,కోడిగుడ్లు లేకుండా ఇంట్లోనే స్టవ్ మీదనే హెల్తీ కేకును ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-నెయ్యి
-ఆయిల్
-ఖర్జూరం
-పాలు
-దాల్చిన చెక్క పొడి
-ఉప్పు
-చాకో చిప్స్
-వాల్ నట్స్
-గోధుమ పిండి
-బేకింగ్ పౌడర్
-బేకింగ్ సోడా

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకొని దాని అడుగున కొంచెం ఆయిల్ లేదా నెయ్యి పూసి అందులో బటర్ పేపర్ వేసి పెట్టుకోండి. బటర్ పేపర్ లేకుంటే కొంచెం గోధుమ పిండి చల్లుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఓ బౌల్ తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు కాచి చల్లార్చిన గోరు వెచ్చని పాలు పోసి అందులో 25 డేట్స్(ఖర్జూరం)విత్తనాలు తీసేసి వేయాలి.కనీసం 1 గంట పాటు పాలలో ఖర్జూరాన్ని నానబెట్టాలి.
-నానబెట్టిన ఖర్జూరాన్ని పాలతో సహా మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన పేస్ట్ లో అరకప్పు ఆయిల్(సన్ ఫ్లయిర్ ఆయిల్)వేసి లేదా కరిగించిన నెయ్యి అయినా వేసి 2 నిమిషాల పాటు లో స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవాలి.
-త్వరగా ఓ బౌల్ మీద జల్లెడ పెట్టుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి, 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించుకొని బౌల్ లోకి తీసుకోండి.
-జల్లించుకున్న పిండిలో మిక్సీలో వేసి చేసిన మిశ్రమం మెత్తాన్ని వేసి కలుపుకోవాలి. పిండి అంతా ఖర్జూరం పాల క్రీమ్ మిశ్రమంతో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, పావు టీస్పూన్ ఉప్పు, పావు కప్పు చాకో చిప్స్ లేదా తరుమిన చాక్లెట్ అయినా వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల చిన్నగా కట్ చేసిన వాల్ నట్స్ కూడా వేసి బాగా కలుపుకోండి.
-కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్ ని ముందుగా ఆయిల్ పూసి ఉంచకున్న గిన్నెలోకి తీసుకోండి. దీనిమీద టాపింగ్ కోసం కొద్దిగా చాకో చిప్స్, వాల్ నట్స్ చిన్న ముక్కలు జల్లుకోండి.
-తర్వాత స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి మధ్యలో ఒక చిన్న స్టాండ్ పెట్టి పైన గిన్నె పెట్టి కవర్ చేసి 10 నిమిషాల పాటు మీడియం మంట మీద వేడి చేసుకోవాలి.
-తర్వాత కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెను స్టవ్ మీద గిన్నెలో ఉన్న స్టాండ్ మీద పెట్టేసి పైన ఐదైనా గిన్నెతో కప్పేసి మీడియం మంట మీద కనీసం 1 గంట పాటు ఉడికించాలి. తర్వాత టూత్ పిక్ తో గుచ్చి చూసుకోండి. కావాలి అనుకుంటే మరో 5 నిమిషాలు లేదనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేయండి.
-పూర్తిగా చల్లారనిచ్చి కేకుని ముక్కలుగా కట్ చేసుకోని తింటుంటే ఆహా సూపర్ అనాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications