Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి!
ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో క్యారెట్ ఫ్రైస్..ఆరోగ్యం, రుచి రెండూ మీ సొంతం!
సాధారణంగా మనం ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే బంగాళాదుంపలతో చేసినవే అని అనుకుంటాం. కానీ దానికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం క్యారెట్ ఫ్రైస్. క్యారెట్ లో ఉండే తీపి, మసాలాల ఘాటుతో కలిపి వీటిని వేయించడం వల్ల ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఇవి త్వరగా తయారవ్వడమే కాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్లను కూడా అందిస్తాయి. క్యారెట్ ఫ్రైస్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు: 4
నూనె: 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి): 1 టేబుల్ స్పూన్
కారం: 1/2 టీస్పూన్
మిరియాల పొడి: 1/4 టీస్పూన్
వెల్లుల్లి పొడి: అర టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర: గార్నిష్ కోసం
తయారీ విధానం
-ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి పైన ఉన్న చెక్కును తీసేయాలి. తర్వాత క్యారెట్ ను అడ్డంగా సగానికి కోసి, పొడవాటి సన్నని ముక్కలుగా కోసుకోవాలి.
-ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ ఆకారంలో ఉంటాయో, ఆ విధంగా క్యారెట్లను అర అంగుళం మందంతో పొడవుగా కట్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కరకరలాడాలంటే కడిగిన తర్వాత వాటిని తడి లేకుండా పొడి వస్త్రంతో తుడవాలి. తడి ఉంటే అవి మెత్తగా ఉడికిపోతాయి తప్ప ఫ్రై అవ్వవు.
-ఒక పెద్ద గిన్నెలో కట్ చేసిన క్యారెట్ ముక్కలను తీసుకోండి. ఇప్పుడు అందులో నూనె వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్, కారం, మిరియాల పొడి, వెల్లుల్లి పొడి, ఉప్పు వేయాలి. ఈ మసాలాలన్నీ క్యారెట్ ముక్కలకు సమానంగా అంటుకునేలా బాగా టాస్ చేయాలి.
-స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేయాలి. క్యారెట్ ముక్కలను పాన్ నిండా వేయకుండా, విడివిడిగా వేసి మీడియం మంటపై వేయించాలి. అన్ని వైపులా తిప్పుతూ ఎర్రగా, కరకరలాడే వరకు వేయించుకోవాలి. దీనికి సుమారు 15 నిమిషాలు పట్టవచ్చు.
-క్యారెట్ ఫ్రైస్ బాగా వేగి, మంచి రంగు వచ్చాక బయటకు తీయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. వీటిని వేడివేడిగా టమాటో కెచప్ లేదా మయోన్నైస్ డిప్ తో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటాయి.
-ఓవెన్ లో చేయాలనుకుంటే.. ముందుగా 200°C (400°F)దగ్గర ప్రీ-హీట్ చేయండి. బేకింగ్ ట్రేలో పార్చ్మెంట్ పేపర్ వేసి క్యారెట్ ముక్కలను ఒకదానికొకటి తాకకుండా విడివిడిగా పరచాలి. వీటిని సుమారు 20-25 నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలో 10 నిమిషాల తర్వాత ముక్కలను తిరగేస్తే రెండు వైపులా సమంగా కాలుతాయి. ముక్కలు బంగారు రంగులోకి మారి, అంచులు క్రిస్పీగా అయ్యేవరకు ఉంచాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





