Latest Updates
-
కండలను ఉక్కును మార్చే రాగితో హెల్తీ బన్ దోశ.. బరువు తగ్గాలంటే పక్కా తినాల్సిందే.! -
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.!
ఇడ్లీ, వడలు పక్కన పెట్టండి..మహారాష్ట్ర స్పెషల్ ఖప్రోలి ట్రై చేయండి..దూదిలా మెత్తగా..
రోజూ తినే ఇడ్లీ, దోశ, వడలు కాకుండా కొత్తగా ఏదైనా రుచి చూడాలని ఆహార ప్రియులు ఎప్పుడూ కోరుకుంటారు. అలాంటి వారికి ఒక అద్భుతమైన, నోరూరించే ప్రత్యామ్నాయం ఖప్రోలి. ఇది మహారాష్ట్ర సంప్రదాయ వంటకం. చూడటానికి అచ్చం మన దోశలాగే అనిపించినా, రుచిలోనూ, మృదుత్వంలోనూ దీని శైలి వేరు.
సాధారణ దోశలు కరకరలాడుతూ ఉంటే ఖప్రోలి మాత్రం మెత్తగా, స్పాంజ్ లాగా ఉంటుంది. దీనిని తీపి కొబ్బరి పాలతో గానీ లేదా కారంగా ఉండే చట్నీలతో గానీ తింటే ఆ రుచే వేరు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకం తయారీ చాలా సులభం. నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువైన ఈ ఖప్రోలిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
మినపప్పు - అర కప్పు
శనగపప్పు - పావు కప్పు
అటుకులు- అర కప్పు
మెంతులు - 1 టీ స్పూన్
పసుపు - చిటికెడు
నూనె లేదా వెన్న - కాల్చడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. మరొక గిన్నెలో మినపప్పు, శనగపప్పు మరియు మెంతులను తీసుకుని బాగా కడిగి వాటిని కూడా నీటిలో నానబెట్టాలి. ఈ మిశ్రమాలన్నింటినీ కనీసం 6 గంటల పాటు నానబెట్టడం ముఖ్యం.
-పప్పులు బాగా నానిన తర్వాత, గ్రైండ్ చేయడానికి కేవలం 10 నిమిషాల ముందు అటుకులను నీటిలో నానబెట్టండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం, పప్పు మిశ్రమం, అటుకులు అన్నీ కలిపి గ్రైండర్ లేదా మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీరు జతచేయండి కానీ పిండి మరీ పల్చగా కాకుండా చూసుకోండి.
-రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. చేత్తో పిండిని బాగా కలపండి. చేత్తో కలపడం వల్ల పిండి త్వరగా పులియడానికి సహాయపడుతుంది.
-ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి, రాత్రంతా లేదా సుమారు 8 గంటల పాటు పిండిని పులియబెట్టాలి.
-మరుసటి రోజు ఉదయానికి పిండి బాగా పొంగి ఉంటుంది. గరిటతో ఒకసారి నెమ్మదిగా కలపండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడి చేయండి.
-పెనం వేడయ్యాక కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండిని వేసి దోశలా నెమ్మదిగా పరచండి. అయితే దీనిని మామూలు దోశలా మరీ పల్చగా కాకుండా, కాస్త మందంగా ఊతప్పంలా వేసుకోవాలి. చుట్టూ కొద్దిగా నూనె లేదా వెన్న వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకోవాలి.వేడి వేడి మృదువైన ఖప్రోలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications