Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
హెల్తీగా బరువు తగ్గి, రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. కొర్రలతో ఈ సూపర్ ఫుడ్ ట్రై చేయాల్సిందే.!
గత కొన్నేళ్లుగా మార్కెట్లో మిల్లెట్స్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. కొర్రలు, సామలు, అరికెలు ఇలా రకరకాల మిల్లెట్స్‌ను తమ డైట్లో భాగం చేసుకుంటున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు, రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు మిల్లెట్స్ దోహదపడతాయి. ఈ క్రమంలో కొర్రలతో రుచికరంగా, ఆరోగ్యకరంగా కిచిడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూద్దాం..

కొర్రల కిచిడీ తయారీకి కావాల్సిన పదార్థాలు
కొర్రలు- ముప్పావు కప్పు
పెసరపప్పు- పావు కప్పు
నీరు- నాలుగన్నర కప్పులు
అల్లం- చిన్న ముక్క
వెల్లుల్లి- 6
ఉల్లిపాయ- ఒకటి
పచ్చిమిర్చి- 4
టమాటా- ఒకటి
క్యారెట్- ఒకటి
బీన్స్- 5
పచ్చి బఠాణీ- పావు కప్పు
జీలకర్ర- టీస్పూన్
ఆవాలు- అర టీస్పూన్
ఉప్పు- అర టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
కారం- అర టీస్పూన్
వెన్న- రెండు టేబుల్ స్పూన్లు
నెయ్యి- టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు- కొద్దిగా
కొర్రల కిచిడీ తయారీ విధానం
కొర్రల కిచిడీ తయారీ కోసం ముందుగా కొర్రలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. కనీసం ఆరు గంటలపాటు నాననివ్వాలి. అప్పుడే కొర్రలు మంచిగా ఉడుకుతాయి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పును కాసేపు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో వెన్న వేసి కరిగాక జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి వేగాక ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కలిపాక రంగు మారేవరకు వేయించాలి. ఇప్పుడు అందులో బీన్స్, క్యారెట్, టమాటా ముక్కలు వేసి మెత్తగా ఉడకనివ్వాలి. ఉప్పు, పసుపు, కారం, కరివేపాకు వేసి మరోసారి కలపాలి.
ఇప్పుడు నానబెట్టుకున్న కొర్రల్లో నీళ్లు ఒంపి వాటిని కుక్కర్లో వేసి మరోసారి కలపాలి. తర్వాత పెసరపప్పు వేసి మొత్తం కలియతిప్పాలి. రెండు నిమిషాల తర్వాత నీళ్లు పోసి కలిపి మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరి మొత్తం పోయాక మూత తీసి పైనుంచి నెయ్యి, కొత్తిమీర వేసి మరోసారి కలపాలి. అంతే హెల్తీ కొర్రల కిచిడీ రెడీ.
ఈ కొర్రల కిచిడీని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా ప్రయోజనాలు చేకూరుతాయి. చల్లారిన తర్వాత కిచిడీ గట్టిపడి రుచిని కోల్పోతుంది. అధిక బరువు, షుగర్, బద్దకం సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ కొద్ది మొత్తంలో ఈ రెసిపీని చేసుకుని తినడం ద్వారా త్వరలోనే హెల్తీగా మారతారు.
ఆరోగ్యకరంగా బరువు తగ్గేందుకు కొర్రలు అద్భుతంగా దోహదపడతాయి. కొర్రల్లో అధిక ఫైబర్, ప్రోటీన్లు, ఇంకా చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కొర్రలు తినడం ద్వారా త్వరగా కడుపు నిండిన భావన కలిగి శరీరానికి ఎంత కావాలో అంత మాత్రమే తినేలా దోహదపడుతుంది.
కొర్రల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. అన్నంలో కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల వీటి స్థానంలో కొర్రలను తీసుకుంటే బాడీలోకి ఎక్కువగా కేలరీలు చేరకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా షుగర్ లెవెల్స్‌ను అదుపులో ఉంచి డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కొర్రలు బెస్ట్ ఆప్షన్. మధ్యాహ్నం లేదా రాత్రి సమయంలో తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
