గణేశ్‌ చతుర్థి స్పెషల్‌.. తమిళనాడు స్టైల్‌లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.!

భక్తుల విశేష పూజలు, నైవేద్యాలు అందుకునేందుకు బొజ్జ గణపయ్య మరో నాలుగు రోజుల్లో సిద్ధం కానున్నాడు. తొమ్మిది రోజుల పాటు సాగే ప్రత్యేక పూజల్లో విశేషంగా ఆకట్టుకునేవి వినాయకుడికి పెట్టే ప్రసాదాలే. విఘ్నేశ్వరుడికి నైవేద్యాల్లో కుడుములు, ఉండ్రాళ్లు, ఉండ్రాళ్ల పాయసం, పులిహోర, దద్దోజనం ఉండనే ఉంటాయి. ఇక పరమాన్నం కూడా పెట్టడం ఆనవాయితీనే. ఈ సారి మీ ఇంటి గణేశుడికి ఇలా తమిళనాడు స్టైల్‌లో పరమాన్నం చేసి పెట్టండి.

Ganesh chaturthi special akkaravadisal tamilnadu sweet recipe for naivedhyam

తమిళనాడు స్టైల్‌లో చేసే ఈ పరమాన్నాన్ని అక్కరవడిసల్‌ అంటారు. రెగ్యులర్‌ పరమాన్నం కంటే మెత్తగా, స్మూత్‌గా నోట్లే వేస్తే కరిగిపోయేలా కమ్మగా ఉంటుంది. లంబోదరుడికి నైవేద్యం సమర్పించాక ఆ ప్రసాదం స్వీకరిస్తే ఆ టేస్ట్‌కి స్వర్గంలో ఉన్న అనుభూతి చెందుతారంటే అతిశయోక్తి కాదు. మరి ఈ అక్కరవడిసల్‌ ఎలా తయారుచేయాలో చూద్దాం..

అక్కరవడిసల్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు

బెల్లం- 350 గ్రాములు
నీళ్లు- ముప్పావు కప్పు
పెసరపప్పు- రెండు టేబుల్‌ స్పూన్లు
బియ్యం- అర కప్పు
పచ్చి పాలు- లీటర్‌
నీళ్లు- లీటర్‌
కాచి చల్లార్చిన పాలు- లీటర్‌
నెయ్యి- అరకప్పు
జీడిపప్పులు- 20
బాదం పప్పులు- 20
కిస్‌మిస్‌- అర కప్పు

అక్కరవడిసల్‌ తయారీ విధానం

తమిళనాడు స్టైల్‌లో పరమాన్నం కోసం ముందుగా రెండు లీటర్ల పాలు తీసుకోవాలి. ఒక లీటర్‌ పాలను పక్కన పెట్టుకుని మిగిలిన పాలను కాచి చల్లారపెట్టుకోవాలి.

Ganesh chaturthi special akkaravadisal tamilnadu sweet recipe for naivedhyam

ఇప్పుడు ఒక పరమాన్నం వండటానికి సరిపోయే బాణలిలో పెసరపప్పు, బియ్యం విడివిడిగా దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక బౌల్‌లో వేసుకుని రెండు సార్లు కడిగి కాసేపు నానబెట్టుకోవాలి.

కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే!

అదే బాణలిలో బెల్లం వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి కరగనివ్వాలి. కాస్త ఉడికిన తర్వాత వేరే బౌల్‌లోకి వడగట్టుకుని చల్లారబెట్టుకోవాలి.

ఇప్పుడు ఆ బాణలిని కడిగి అందులో పచ్చి పాలను తీసుకుని కాగబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చిన్న మంటపైన కాసేపు మరిగించి లీటర్‌ నీళ్లు పోసి మరికాసేపు కాగనివ్వాలి. పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి ఉడికించుకోవాలి.

Ganesh chaturthi special akkaravadisal tamilnadu sweet recipe for naivedhyam

చిన్న మంటపైన ఈ పరమాన్నం ఉడికించాలి. అప్పుడే బియ్యం, పప్పు పాలల్లో మెత్తగా ఉడుకుతుంది. ఈ ప్రాసెస్‌కి దాదాపు 45 నిమిషాలు పడుతుంది. అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చిక్కగా ఉడికిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసి మొత్తం కలిసేలా కలిపి ఐదు నిమిషాల పాటు చిన్నమంటపైన ఉడికించాలి.

పులియబెట్టాల్సిన పనిలేదు.. దోశ పిండి లేకపోతే ఇన్‌స్టంట్‌గా ఈజీగా చేసుకునేలా.!

చల్లారిన బెల్లం పాకాన్ని ఈ పరమాన్నంలో పోసి కలిపి చిన్న మంటపైన ఉడకనివ్వండి. ఇప్పుడు మరో స్టవ్‌పైన చిన్న కడాయి పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగిన తర్వాత కట్‌ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కిస్‌మిస్‌లు వేసి అవి పొంగుతున్నప్పుడు స్టవ్‌ ఆఫ్‌ చేసి పరమాన్నంలో వేసి నెయ్యి కలిసేలా గరిటెతో కలపండి.

రెండు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత టీస్పూన్‌ ఏలకుల పొడి స్టవ్‌ ఆఫ్‌ చేసి బొజ్జ గణపయ్యకి నైవేద్యంగా సమర్పించండి.

[ of 5 - Users]
Story first published: Thursday, September 10, 2026, 13:21 [IST]
Desktop Bottom Promotion