చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు?

మనదేశంలో భోజనం అంటే పెరుగు ఉండాల్సిందే. ఎన్ని కూరలతో అన్నం తిన్నా చివర్లో కాస్త పెరుగు వేసుకొని తింటే తృప్తిగా ఉంటుంది. చాలామందికి భోజనం చివర్లో పెరుగు లేకుంటే ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది.

వేడి అన్నంతో తిన్నా, చద్దన్నంతో తిన్నా పెరుగు అద్భుతంగానే ఉంటుంది. పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, మన పేగుల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తాయని అందరికీ తెలిసిందే.

Stop Eating Cold Curd Straight from the Fridge Here s Why

అయితే ఇక్కడే మనం తరచుగా చేసే ఒక చిన్న పొరపాటు మన ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేంటంటే.. ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే అతి చల్లటి పెరుగును తినడం. క్యాన్సర్ హీలర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ తరంగ్ కృష్ణ ఈ విషయంపై పలు ఆసక్తికరమైన, అతి ముఖ్యమైన విషయాలను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపారు.

చల్లటి పెరుగు ఎందుకు ప్రమాదకరం?

పెరుగు త్వరగా పాడవకుండా, పులవకుండా ఉండేందుకు మనం దానిని ఫ్రిడ్జ్ లో పెడుతుంటాం. ఫ్రిజ్ అనేది ఆహారాన్ని నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కానీ, దాని నాణ్యతను పెంచదు. ఫ్రిజ్ లోంచి తీసిన వెంటనే బాగా చల్లగా ఉన్న పెరుగును తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు ఒక్కసారిగా మందగిస్తుంది.

ఆయుర్వేదం ప్రకారం..చల్లటి పదార్థాలు జీర్ణం కావడం చాలా కష్టం. ఇది శరీరంలో కఫ దోషాన్ని అమాంతం పెంచుతుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా పెరుగులోని మంచి బ్యాక్టీరియా చురుకుదనం ఉష్ణోగ్రతను బట్టి మారుతుంటుంది. అతి చల్లటి వాతావరణంలో ఆ మంచి బ్యాక్టీరియా నిర్వీర్యమైపోతుంది.

చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే!చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే!

సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ఉంటేనే..

పలు అధ్యయనాల ప్రకారం.. పెరుగులోని మంచి బ్యాక్టీరియా సాధారణ గది ఉష్ణోగ్రత(రూమ్ టెంపరేచర్)దగ్గర మాత్రమే అత్యంత చురుకుగా పనిచేస్తుంది. అప్పుడే అది మన శరీరానికి పూర్తి స్థాయిలో మేలు చేస్తుంది. అందుకే పెరుగును చల్లగా కాకుండా సాధారణ ఉష్ణోగ్రత వద్దే తినాలని డాక్టర్ తరంగ్ కృష్ణ సూచిస్తున్నారు.

పెరుగును సరైన పద్ధతిలో ఎలా తినాలి?

అరగంట ముందే తీయండి
మీరు భోజనం చేయడానికి కనీసం అరగంట ముందు పెరుగు గిన్నెను ఫ్రిజ్ లోంచి బయటకు తీసి పక్కన పెట్టండి. అది వాతావరణ ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత మాత్రమే తినండి.

పగటి పూట మాత్రమే తినండి
పెరుగు తినడానికి అత్యుత్తమ సమయం మధ్యాహ్నం. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, కడుపును చల్లబరుస్తుంది. అదనపు రుచి, ఆరోగ్య ప్రయోజనాల కోసం పెరుగులో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు నల్ల మిరియాల పొడి కలుపుకుని తినండి.

రాత్రి పూట అస్సలు వద్దు
రాత్రి వేళల్లో పెరుగు తినే అలవాటును మానుకోవాలి. రాత్రి పూట దీనిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలతో పాటు జీర్ణ సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి.

తాజా పెరుగుకే ప్రాధాన్యం
ఎప్పుడూ తాజాగా తోడుపెట్టుకున్న కమ్మటి పెరుగును మాత్రమే తినండి. మరీ పుల్లగా మారిన లేదా ఎప్పటికప్పుడో నిల్వ ఉన్న పెరుగు తినడం వల్ల ఎసిడిటీ పెరిగి శరీరానికి హాని కలుగుతుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, September 10, 2026, 14:20 [IST]
Desktop Bottom Promotion