Latest Updates
-
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక
గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కర్రీ..నోటికి స్వర్గమే!
మర్యాద అంటే గోదారోళ్లు, రుచి అన్నా గోదారోళ్లేనండి. గోదారోళ్ల స్టైల్ లో చేపల పులుసు అంటే.. ఆ మాట వింటేనే చాలామందికి నోట్లో నీళ్లూరిపోతాయి. అందులోనూ చేపల్లో రారాజు, ఒక్క ముల్లు కూడా అడ్డురాని వంజరం చేపతో కర్రీ అంటే టేస్ట్ అదిరిపోతుంది.
వంజరం చేపకి ఉండే ప్రత్యేకత ఏంటంటే.. దీనికి ఎక్కువ ముళ్ళు ఉండవు. మధ్యలో ఒకే ఒక వెముక ఉంటుంది. అందుకే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ భయం లేకుండా లాగించేయొచ్చు. గోదారోళ్ల స్టైల్ లో వంజరం చేపల కూర ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
వంజరం చేప ముక్కలు
నువ్వుల నూనె
ఉప్పు
కారం
పసుపు
పచ్చిమిరపకాయలు
కొత్తిమీర
కరివేపాకు
అల్లంవెల్లుల్లి పేస్ట్
రాళ్ల ఉప్పు
టమాటోలు
ధనియాల పొడి
వెల్లుల్లి రెబ్బలలు
ఉల్లిపాయ తరుగు
చింతపండు
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో శుభ్రంగా కడిగిన వంజరం ముక్కలు వేసి, ఇందులో కొద్దిగా పసుపు , కారం, ఉప్పు వేసి మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో నువ్వుల నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడయ్యాక ఇందులో ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
-ఆవాలు,మెంతులు వేగాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాక ఇందులోనే తరిగిన టమాటోలు, రాళ్ల ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి టమాటోలు మగ్గి నూనె పైకి తేలేంత వరకు వేయించాలి.
-ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో చిక్కటి చింతపండు గుజ్జు నీళ్లు పోసి 5 నిమిషాలు చింతపండు పచ్చి వాసన పోయేదాకా మరగనివ్వాలి.
-తర్వాత పక్కన ఉంచుకున్న ఉప్పు,పసుపు, కారం కలిపిన చేప ముక్కలను నెమ్మదిగా బాండీలో వేయాలి. గరిట పెట్టకుండా చేతులతో బాండీని పట్టకొని తిప్పి మూతపెట్టి చిన్న మంటపై 10 నిమిషాలు ముక్కల్ని ఉడికి నూనె పైకి తేలేంతవరకు ఉడకనివ్వాలి.
-ఇప్పుడు అందులో కొత్తిమీర తరుగు చల్లుకొని స్టవ్ ఆపేయండి. అంతే సూపర్ టేస్టీ వంజరం చేపల కర్రీ రెడీ.
కొన్ని ప్రయోజనాలు
వంజరం చేప మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వంజరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీపీని కంట్రోల్ లో ఉంచడంలో ఇది బాగా పనిచేస్తుంది.
వంజరంలో ఉండే విటమిన్ A, ఒమేగా-3 కంటి చూపుని మెరుగుపరుస్తాయి. వంజరంలోని పోషకాలు మెదడు కణాలను యాక్టివ్ గా ఉంచుతాయి. ముఖ్యంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి, ఏకాగ్రత కుదరడానికి ఇది దోహదపడుతుంది. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ D, కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications