Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
గోదారోళ్ల సంక్రాంతి స్పెషల్..నోరూరించే కొబ్బరి పాకుండలు..ఈజీగా చేసుకోండిలా..
సంక్రాంతి అంటేనే పంటల పండుగ, పిండి వంటల పండుగ. అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతాయి. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, బసవన్నల దీవెనలతో పాటు.. ఇంటి నిండా ఘుమఘుమలాడే పిండివంటల వాసన ఈ పండుగ ప్రత్యేకత.
గోదారోళ్ల ఆతిథ్యం ఎంత గొప్పగా ఉంటుందో, వారి వంటకాలు కూడా అంతే రుచిగా ఉంటాయి. అరిసెలు, బూరెలు, జంతికలు ఎంత ఫేమస్సో..కొబ్బరి పాకుండలు కూడా అంతే ప్రత్యేకం. కొబ్బరి, బెల్లం రుచితో నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ పాకుండలు గోదావరి జిల్లాల సంక్రాంతి స్పెషల్. గోదారోళ్ల స్టైల్ లో సంప్రదాయబద్ధమైన కొబ్బరి పాకుండలు మీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
-బియ్యం
-బెల్లం
-పచ్చి కొబ్బరి
-యాలకుల పొడి
-నెయ్యి
-నూనె
తయారీ విధానం
-ముందుగా 1 కేజీ బియ్యాన్ని(కొత్త బియ్యం బెటర్) శుభ్రంగా కడిగి నీళ్లు పోసి కనీసం 18 గంటల పాటు నానబెట్టాలి.
-తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి, ఒక పొడి గుడ్డపై 15-20 నిమిషాల పాటు ఆరబెట్టాలి. బియ్యం మరీ పొడిగా ఆరిపోకూడదు, కొద్దిగా తేమ ఉండగానే మిక్సీలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె లేదా పాన్ పెట్టి అందులో పావు కేజీ బెల్లం తురుము,పావు కప్పు నీళ్లు పోసి ముద్ద పాకం(అరిసెల పాకం)వచ్చే వరకు మరిగించాలి. పాకం కొంచెం చల్లటి నీళ్లలో వేస్తే మెత్తని జల్లీలా ఉండలా ఏర్పడ్డాక స్టవ్ ఆపేసి దించేయాలి.
-తర్వత బెల్లం పాకం ఉన్న పాన్ లోనే 2 టేబుల్ స్పూన్ల గసగసాలు, 1 మీడియం సైజ్ పచ్చి కొబ్బరికాయ తురుము, 4 కప్పుల(బెల్లం తీసుకున్న కప్పు కొలతనే)గ్రైండ్ చేసి ఉంచుకున్న తడి పిండి మెల్లి మెల్లిగా వేస్తూ మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో 1 టీస్పూన్ యాలకల పొడి వేసి కలుపుకోవాలి. కలిపిన పిండి ముద్దగా,దగ్గరగా ఉండేలా చూసుకోవాలి.
-కలిపిన పిండిని 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. దీంతో అది చల్లారుతుంది.
-తర్వాత చేతికి,పళ్లెనికి నెయ్యి రాసి కలపిన పిండిని నిమ్మకాయ సైజు అంత ఉండలుగా చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక బాండీ సైజుని బట్టి పాకుండలు వేసి అలా వదిలేయండి. మీడియం మంట మీద నిదానంగా వేగనివ్వాలి. వెంటనే గరిటతో తిప్పకూడదు. అవి కాస్త వేగి పైకి తేలిన తర్వాత, గరిటతో అటు ఇటు తిప్పుతూ వేయించాలి.
-పాకుండలు ముదురు గోల్డెన్ కలర్ లోకి రావడానికి సుమారు 10-12 నిమిషాలు పడుతుంది. అప్పుడు వాటిని బయటకు తీసుకోండి. అంతే పాకుండలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications