Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
చికెన్, మటన్ కూడా పనికిరావు.. ఈ గోంగూర గుడ్డు కర్రీ రుచి చూస్తే వదిలిపెట్టరు!
తెలుగు రాష్ట్రాల వంటకాల గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తుకొచ్చేది గోంగూర. గోంగూరను ఆంధ్రా మాత అని కూడా ముద్దుగా పిలుచుకుంటారు. గోంగూరతో చేసే పచ్చడి, మటన్, చికెన్ కర్రీలు ఎంతటి ప్రాచుర్యం పొందాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాంసాహారం తినని వారికి లేదా గుడ్డును ఇష్టపడే వారికి గోంగూర గుడ్డు కర్రీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం.

గుడ్డులోని పోషకాలు, గోంగూరలోని పులుపు, ఐరన్ కలిసి ఈ కూరను కేవలం రుచికరమైనదిగానే కాకుండా, అత్యంత ఆరోగ్యకరమైనదిగా కూడా మారుస్తాయి. వేడి వేడి అన్నంలో ఈ గోంగూర గుడ్డు కర్రీ కలుపుకుని తింటే ఆ రుచే వేరు. అలాగే బిర్యానీ, చపాతీ, రోటీ, పుల్కాలలో కూడా ఇది అద్భుతమైన కాంబినేషన్. గోంగూర గుడ్డు కర్రీని ఇంట్లోనే రెస్టారెంట్ రుచితో ఎలా సులభంగా తయారు చేసుకోవాలో దీనిని తినడం వల్ల మనకు లభించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇక్కడ చూడండి.
గోంగూర గుడ్డు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
-గుడ్లు
-గోంగూర ఆకులు
-నూనె
-పసుపు
-ఉప్పు
-కారం
-వెల్లుల్లి
-కొత్తిమీర
-మటన్ మసాలా
-జీలకర్ర
గోంగూర గుడ్డు కర్రీ తయారీ విధానం
-ముందుగా 2 కట్టల గోంగూర ఆకులను కాడల నుండి వేరుచేసి, రెండు మూడు సార్లు నీటిలో శుభ్రంగా కడగాలి.
-తర్వాత గోంగూర ఆకులను మిక్సీ గిన్నెలో వేయాలి,ఇందులోనే 2 టీగ్లాసుల నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు 5-10 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అందులో 4 కోడిగుడ్లు పగులకొట్టి వేసుకోండి. ఇందులోనే 1 టీస్పూన్ కారం, అర టీస్పూన్ ఉప్పు, పావు టీస్పూన్ పసుపు కూడా వేసుకొని తక్కువ మంట మీద కలుపుకోండి. మరీ ఎక్కువగా కాకుండా లైట్ గా కలుపుకోండి. కోడిగుడ్డు అనేది ముక్కులుగా రావాలి కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి.
-ఇప్పుడు కడాయి మీద మూతపెట్టి 1 నిమిషం వేగనివ్వాలి. తర్వాత మూత తీసి వేగిన కోడిగుడ్డు మిశ్రమంలో దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని కొంచెం వేగనివ్వాలి.
-ఇప్పుడు అందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. గుడ్డు ముక్కలన్నీ ఎర్రగా వేగి ఆయిల్ బయటకు రిలీజ్ అవుతున్నప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. మిక్సీజార్ లో కొంచెం నీళ్లు పోసి వాటిని కూడా స్టవ్ మీద కడాయిలో పోసి కలుపుకోండి.
-మీడియం మంట మీద ఒకసారి జాగ్రత్తగా కలుపుకున్నాక ఇందులో 1 టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మిశ్రమంలోని నీరు అంతా ఇగిరిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యేవరకు ఉడికించుకోవాలి.
-తర్వాత మూత తీసి అందులో చికెన్ మసాలా లేదా మటన్ మసాలా అర టీస్పూన్ వేసుకొని కలిపి కొంచెం కొత్తిమీర తరుగు చల్లుకొని దించేయండి.అంతే గోంగూర గుడ్డు కర్రీ రెడీ.

ఆరోగ్య ప్రయోజనాలు
-గోంగూరలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే గుడ్డులో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి క్యాల్షియంను శరీరం శోషించుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ కూర తినడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.
-ఈ కర్రీలో మనం సరైన మోతాదులో నూనెను వాడితే, ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి డైట్ ఆప్షన్. గుడ్డు, పీచు పదార్థం ఉన్న గోంగూర తినడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది, తద్వారా పదే పదే ఆకలి వేయదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications