Latest Updates
-
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
నూనె చుక్క లేకుండా ఘుమఘుమలాడే వెజ్ పులావ్..టేస్ట్ సూపరో సూపర్..బరువు తగ్గాలనుకునేవాళ్లకి పర్ఫెక్ట్!
ఘుమఘుమలాడే పులావ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి? అయితే బరువు తగ్గాలనుకునే వారు, కఠినమైన డైట్ పాటించే వారు ఇందులో వాడే నూనె, నెయ్యి గురించి భయపడి పులావ్ కు దూరంగా ఉంటారు. కానీ ఇకపై ఆ బెంగ లేకుండా నూనె చుక్క లేకుండా రుచికరమైన వెజిటబుల్ పులావ్ తయారుచేసుకోవచ్చు.
ఆయిల్ ఫ్రీ వెజిటేబుల్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
తాజా బీన్స్ - అర కప్పు
క్యారెట్లు - 2
క్యాలీఫ్లవర్ - అర కప్పు
పాలు - ముప్పావు కప్పు
పసుపు - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
బిర్యానీ ఆకులు- 2
లవంగాలు - 2
నల్ల మిరియాలు - 5 లేదా 6
దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
యాలకులు - 4 లేదా 5
జాజికాయ పొడి - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
జీడిపప్పు - కొద్దిగా

ఆయిల్ ఫ్రీ వెజిటేబుల్ పులావ్ తయారీ విధానం
-ముందుగా బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు పోసి సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పులావ్ పొడిపొడిగా, మృదువుగా వస్తుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ముందుగా తీసుకున్న ముప్పావు కప్పు పాలలో సగం పాలను పోసి వేడి చేయాలి. పాలు కొద్దిగా వేడెక్కగానే అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, మిరియాలు, జాజికాయ వేసి బాగా కలపాలి. మసాలా దినుసుల సువాసన పాలతో కలిసి ఘుమఘుమలాడే వరకు సన్నని మంట మీద మరగనివ్వాలి.
-ఆ తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ ముక్కలను వేసి బాగా కలపాలి. కూరగాయలు పాలల్లో కాస్త మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొద్దిగా చక్కెర వేసి కలుపుకోవాలి. కావాలనుకుంటే కొన్ని జీడిపప్పులను కూడా వేసుకోవచ్చు.
-ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంలో నుండి నీటిని పూర్తిగా వంపేసి, ఆ బియ్యాన్ని కుక్కర్ లో వేసి నిదానంగా కలపాలి. కుక్కర్ లోని పాలు ఇంకిపోయిన తర్వాత, మిగిలి ఉన్న పాలను, బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను పోసి కలపాలి.
-ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద ఉంచాలి. సరిగ్గా ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. కూరగాయలు, బియ్యం పర్ఫెక్ట్ గా ఉడకడానికి ఒక విజిల్ సరిపోతుంది.
-కుక్కర్ లోని ఆవిరి పూర్తిగా పోయేంత వరకు ఆగి, అప్పుడు మూత తెరవాలి. అంతే గుమగుమలాడే వేడి వేడి నూనె లేని వెజిటబుల్ పులావ్ రెడీ. పైన సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకోండి.
-ఈ హెల్తీ పులావ్ ను చల్లటి పెరుగు రైతాతో కలిపి తింటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
