Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
అమృతం లాంటి రాగి గంజి.. బరువు తగ్గేందుకు బెస్ట్..ఎలా చేసుకోవాలంటే..
ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. మీరు కూడా పెరిగిన శరీర బరువుతో ఇబ్బంది పడుతున్నారా? జిమ్ములో గంటల తరబడి వ్యాయామం చేస్తున్నా, డైటింగ్ చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదా? అయితే, కేవలం వ్యాయామం మాత్రమే సరిపోదు, దానికి తోడు సరైన ఆహార నియమాలు కూడా పాటించాల్సిందే.
ముఖ్యంగా మనం రోజును ప్రారంభించే అల్పాహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గడంతో పాటు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే అద్భుతమైన ఆహారం రాగులు. రాగులతో తయారు చేసిన రాగి గంజిని ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందడమే కాకుండా, బరువు సులభంగా తగ్గుతారు. రాగి గంజిని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
రాగి పిండి: పావు కప్పు
నీళ్లు: 3 కప్పులు (మరిగించడానికి), 1 కప్పు (నానబెట్టడానికి)
చిక్కటి పెరుగు: 3 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
పచ్చిమిర్చి: 2
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం
రాత్రి పడుకునే ముందు ఒక గిన్నెలో రాగి పిండిని తీసుకొని, అందులో ఒక కప్పు నీళ్ళు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా అలాగే నానబెట్టాలి.
మరుసటి రోజు ఉదయం, నానబెట్టిన రాగి పిండి మిశ్రమాన్ని చూడండి. పైన ఏవైనా నురుగు లేదా తేటలా ఉంటే దానిని తొలగించండి. పిండి అడుగున ఉంటుంది కాబట్టి ఒక చెంచాతో మిశ్రమాన్ని మళ్ళీ బాగా కలపండి.
తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో 3 కప్పుల నీళ్ళు పోసి మరిగించండి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న రాగి పిండి మిశ్రమాన్ని అందులో పోస్తూ, ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. రాగి పిండి బాగా ఉడికి, మిశ్రమం దగ్గర పడేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఉడికించిన రాగి గంజిని పూర్తిగా చల్లారనివ్వాలి.
రాగి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత అందులో 3 స్పూన్ల చిక్కటి పెరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లి బాగా కలపాలి. గంజి మరీ చిక్కగా అనిపిస్తే తగినన్ని నీళ్ళు పోసి పల్చగా చేసుకోవచ్చు.
సిద్ధమైన ఈ పోషకాల గనిని ఒక గ్లాసులో లేదా బౌల్ లోకి తీసుకోండి. పైన ఇంకాస్త సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు చల్లి సర్వ్ చేసుకోండి. పుల్లపుల్లగా, కమ్మగా ఉండే ఈ రాగి గంజిని ఉదయం పూట తాగితే ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటారు. ఇది బరువు తగ్గించడమే కాకుండా, శరీరాన్ని చల్లబరుస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







