Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
అమ్మమ్మల నాటి పచ్చి టమాటా రోటి పచ్చడి..చికెన్, మటన్ కూడా దేనికీ పనికిరావు!
తెలుగు రాష్ట్రాల భోజన ప్రియులకు రోటి పచ్చడి అనగానే నోట్లో నీళ్లు ఊరతాయి. ఆధునిక కాలంలో ఎన్ని రకాల కొత్త వంటకాలు వచ్చినా.. మన అమ్మమ్మలు, నానమ్మలు రోట్లో నూరిన పచ్చడి రుచికి ఏదీ సాటిరాదు. అందులోనూ పచ్చి టమాటా పచ్చడి అంటే ప్రాణం పెట్టేవాళ్లు చాలా మందే ఉన్నారు.
వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని, ఈ పచ్చి టమాటా రోటి పచ్చడి కలుపుకుని తింటుంటే ఆ రుచికి చికెన్, మటన్ లాంటి నాన్ వెజ్ వంటకాలు కూడా ఎందుకూ పనికిరావు. కేవలం రుచి మాత్రమే కాదు, పచ్చి టమాటాల్లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, జీర్ణకోశ సమస్యలు మాయమవుతాయి.

పచ్చి టమాటా పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి టమాటాలు: పావు కిలో (250 గ్రాములు)
పచ్చిమిర్చి: 150 గ్రాములు
చింతపండు: 100 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు: 10
జీలకర్ర: అర టీ స్పూన్
ఉల్లిపాయలు: 2
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా రాళ్ల ఉప్పు
పోపు కోసం: ఆయిల్, ఆవాలు, పచ్చి శనగపప్పు, మినుములు, ఎండుమిర్చి,
కరివేపాకు, కొత్తిమీర
పచ్చి టమాటా పచ్చడి తయారీ విధానం
-ముందుగా పచ్చి టమాటాలను, పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేయాలి.
-నూనె వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న పచ్చి టమాటా ముక్కలను వేసి దోరగా వేయించాలి. టమాటాలు సగం మగ్గిన తర్వాత, అందులో పచ్చిమిర్చి ముక్కలు, చింతపండు వేసి మూతపెట్టి పచ్చి వాసన పోయేంతవరకు స్టవ్ మీదే సన్నటి మంటపై వీటిని చక్కగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-మిక్సీలో వేస్తే పచ్చడి రుచి మారిపోతుంది. కాబట్టి రోట్లో దంచుకుంటేనే అద్భుతమైన రుచి వస్తుంది.
-శుభ్రం చేసిన రోట్లో ఉడికించి పెట్టుకున్న పచ్చి టమాటా, పచ్చిమిర్చి, చింతపండు మిశ్రమాన్ని వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా రుబ్బుకోవాలి.
-పచ్చడి కాస్త మెదిగాక, తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్కసారి అలా దంచి తీసేయాలి. ఉల్లిపాయలు మెత్తగా అవ్వకూడదు, పంటికి తగులుతుంటేనే పచ్చడి రుచి రెట్టింపు అవుతుంది.
-పచ్చడికి అసలైన రుచినిచ్చేది తాలింపు. ఇందుకోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, పచ్చి శనగపప్పు, మినుములు వేసి వేయించాలి. ఆ తర్వాత నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర తురుము వేసి దోరగా వేయించి పచ్చి టమాటా పచ్చడిలో వేసి బాగా కలపాలి.
-అంతే నోరూరించే పచ్చి టమాటా రోటి పచ్చడి రెడీ. దీనిని వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications