Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఉలవచారు లేదా ఉలవకట్టు అనగానే తెలుగువారికి నోరూరుతుంది. పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఎంతో ఓపికగా కట్టెల పొయ్యి మీద మట్టి కుండలో చేసే ఈ ఉలవచారు రుచి అద్భుతంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వేడివేడిగా ఈ చారును తాగినా, అన్నంలో కలుపుకుని తిన్నా శరీరానికి ఎంతో వెచ్చదనం, బలం చేకూరుతాయి. ఎలాంటి ప్యాకెట్ పొడులు వాడకుండా, ఇంట్లోనే రోట్లో దంచిన మసాలాతో అసలు సిసలైన ఉలవచారు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

ఉలవచారు తయారీకి కావాల్సిన పదార్థాలు
-చింతపండు
-ఉలవలు
-ఉప్పు
-టమాటోలు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-కళ్లు ఉప్పు
-పసుపు
-మిరియాలు
-వెల్లుల్లి
-ఆవాలు
-జీలకర్ర
-ధనియాలు
-నూనె
-కరివేపాకు
-కొత్తిమీర
-ఎండుకొబ్బరి తురుము
-ఇంగువ
ఉలవచారు తయారీ విధానం
-ఉలవచారు తయారీ కోసం ముందుగా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండులో ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి నానబెట్టుకోండి.
-ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఉలవలు వేసి సన్నని మంట మీద కలుపుతూ వేయించాలి. అవి చిట్లుతున్నప్పుడు స్టవ్ ఆపేసి వాటిని చల్లారనివ్వాలి.
-చల్లారిన తర్వాత ఆ ఉలవలను మిక్సీ గిన్నెలో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో అర టేబుల్ స్పూన్ మిరియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి సన్నని సెగ మీద మంచి సువాసన వచ్చేవరకు మాత్రమే కలుపుతూ వేయించాలి. 3లేదా 4 నిమిషాలకు ఇవి వేగిపోతాయి. అప్పుడు స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వాలి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో గ్రైండ్ చేసి ఉంచిన ఉలవల మిశ్రమంలోనే చల్లారిన మసాలా దినుసులను వేసి మొత్తాన్ని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి.
-ఇప్పుడు ఒక గిన్నెలో రెండు పచ్చిమిర్చి చీలికలు. 1 రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర తరుగు, పండిన 2 టమాటోల ముక్కలు, రాళ్ల ఉప్పు వేసి చేత్తో ఈ మొత్తాన్ని పిండుతూ సారం తీయండి.
-టమాటోలను మెత్తగా చిదుముకొని సారం తీసిన తర్వాత అందులోనే ఒకటిన్నర లీటరు చింతపండు రసం పోసి మళ్లీ టమాటోలను గట్టిగా పిండుతూ సారం తీయండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దిగా పసుపు, గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉలవల పొడి వేసి గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కలుపుకున్న మిశ్రమం అంతా పోసి అందులోని పచ్చి మిర్చి మెత్తబడేవరకు మరిగించండి. చారు మరుగుతున్నప్పుడే అందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం వేయండి.
-చారు బాగా మరిగి మెత్తబడేలోగా తాలింపు రెడీ చేసుకోండి. ఇందుకోసపం స్టవ్ మీద బాండీ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక అందులో 1 ఎండుమిర్చి ముక్కలు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర, 10 దంచిన వెల్లుల్లి రెబ్బలు, 1 రెబ్బ కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి తాలింపుని ఎర్రగా వేయించాలి.
-వేగిన తాలింపుని స్టవ్ మీద సన్నని సెగ మీద మరుగుతున్న చారులో పోసి కలుపుకోవాలి. చివరగా చారులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేయండి.
-అంతే అసలు సిసలైన ఉలవచారు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
