Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
హోటల్ స్టైల్ లో క్రిస్పీ పాలక్ దోస..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి
దక్షిణ భారతదేశంలో ఉదయం లేవగానే గుర్తుకొచ్చే బ్రేక్ ఫాస్ట్ లలో దోస మొదటి వరుసలో ఉంటుంది. వేడివేడి పెనం మీద కాలుతున్న దోస వాసన చాలు ఆకలి పుట్టించడానికి. కానీ రోజూ ఆ సాదా దోసెలు లేదా మసాలా దోసెలు తిని మీకు విసుగు పుట్టిందా? మీ నాలుక కొత్త రుచిని కోరుకుంటోందా? అయితే పాలక్ దోస ట్రై చేయాల్సిందే.
కేవలం రుచిలోనే కాదు, ఆరోగ్యంలోనూ దీనికి తిరుగులేదు. పాలకూరలోని పోషకాలు, దోసెలోని క్రిస్పీనెస్ కలిసి దీనిని ఒక సూపర్ బ్రేక్ ఫాస్ట్ గా మారుస్తాయి. చాలామంది పిల్లలు ఆకుకూరలు తినడానికి మారాం చేస్తారు. పెద్దవాళ్లు కూడా కొన్నిసార్లు పాలకూర వంటకాలను ఇష్టపడరు. అలాంటి వారికి పాలకూరను తినిపించడానికి ఈ దోస ఒక అద్భుతమైన మార్గం. హెల్తీ,క్రిస్పీ పాలక్ దోస ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
బియ్యం (దోస బియ్యం) - 2 కప్పులు
మినపప్పు - అర కప్పు
పాలకూర - ఒక పెద్ద కట్ట
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - దోసెలు కాల్చడానికి
తయారీ విధానం
-ముందుగా బియ్యం, మినపప్పును శుభ్రంగా కడిగి, వేర్వేరుగా లేదా కలిపి కనీసం 5 నుండి 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.
-పాలకూరను శుభ్రంగా కడిగి పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో పాలకూర ఆకులు, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే చాలా తక్కువ నీరు వాడండి. ఈ మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ జార్ లో నానబెట్టిన బియ్యం,నానబెట్టిన మినపప్పు, తగినన్ని నీళ్లు పోసి మెత్తని దోసె పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో ముందుగా సిద్ధం చేసుకున్న పాలకూర పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
-దోసెలు క్రిస్పీగా రావాలంటే పిండి పులియడం ముఖ్యం. ఈ మిశ్రమాన్ని కనీసం 6 నుండి 8 గంటలు లేదా రాత్రంతా మూత పెట్టి పక్కన ఉంచండి. పిండి పులిసినప్పుడు దోసెలు రంధ్రాలతో, మంచి రుచితో వస్తాయి.
-స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ లేదా దోసె పెనం పెట్టి వేడి చేయండి. పెనం వేడెక్కాక గరిటెడు పిండిని తీసుకుని పెనం మధ్యలో వేసి వృత్తాకారంలో పల్చగా విస్తరించండి.
-దోసె చుట్టూ కొంచెం నూనె లేదా నెయ్యి వేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి దోసెను ఎర్రగా, క్రిస్పీగా కాల్చండి. అడుగు భాగం బంగారు గోధుమ రంగులోకి రాగానే దోసెను మడిచి ప్లేట్ లోకి తీసుకోండి.
-వేడి వేడి పాలక్ దోసెను కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. కాస్త పుల్లగా, కారంగా కావాలనుకుంటే టమాటా చట్నీ లేదా అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ ఫీల్ కావాలంటే వేడి సాంబార్ తో కలిపి ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








