Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
Guntur special kova puri: గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఈ టిప్స్ తో చేసుకుంటే లైఫ్ లో దీని టేస్ట్ మర్చిపోరు
స్వీట్లు ఇష్టపడే ఎవరికైనా కోవా పూరీ పేరు చెప్తేనే నోట్లు నీళ్లు ఊరుతుంటాయి. కోవా పూరీ అనేది చాలా మందికి ఫేవరెట్ స్వీట్ అని చెప్పవచ్చు. అందులోనూ గుంటూరు స్పెషల్ కోవా పూరి ఒక్కసారి తిన్నారంటే జీవితమంతా దాని టేస్ట్ గుర్తు చేసుకోవాల్సిందే. అంత రుచిగా ఉంటుంది మరి. అయితే కొన్ని టిప్స్ తో గుంటూరు స్పెషల్ కోవా పూరీని చేసుకుంటే స్వీట్ షాపుల్లో ఉండే టేస్ట్ కన్నా ఎక్కువ రుచిగా ఉంటుంది. కాబట్టి ఇంట్లోనే సింపుల్ గా గుంటూరు స్పెషల్ కోవా పూరీ తయారుచేయడానికి ఏమేం పదార్థాలు కావాలి, కోవా పూరీ తయారీ విధానం ఏంటో ఇక్కడ చూడండి.
కోవా పూరీ తయారీకి కావాల్సినవి
-పాలు
-చక్కెర
-గోధుమ పిండి
-మైదా పిండి
-బెల్లం
-యాలకల పొడి
-నిమ్మరసం
-నూనె

-ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులో ఒక కప్పు గోధుమ పిండి,అరకప్పు మైదాపిండి,రెండు టేబుల్ స్పూన్ల తరిగిన బెల్లం వేయండి.
-ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా రెండు కప్పుల నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలపి మూత పెట్టి పక్కనపెట్టుకోండి. ఈ పిండి దోశ పిండి మాదిరిగా ఉండాలి. గట్టిగా ఉండకూదు.
-ఇప్పుడు స్టవ్ మీద పన్ పెట్టి ఓ లీటర్ పాలు అందులో పోసి మధ్య మధ్యలో వచ్చే మీగడను గంటెతో పాలలోకి కలుపుకుంటూ పొంగు వచ్చే వరకు బాగా వేడి చేయండి.
-పాలు సగం వచ్చేంతవరకు బాగా మరగిలోపు స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టి అందులో ఒక కప్పు చక్కెర,ఒక కప్పు నీళ్లు పోసి చక్కెరను బాగా కరిగించండి.
-చక్కెర కరిగిపోయిన తర్వాత పాకాన్ని నిమిషాల పాటు మరిగించి చేతికి కొంచెం తీసుకొని చూసి అది జిగురుగా ఉంటే చాలు.
-ఇఫ్పుడు ఇందులో కొంచెం యాలకుల పోడి వేసి కలిపి మూత పెట్టుకోని పక్కన ఉంచండి.
-ఇప్పుడు బాగా మరిగి సగం వరకు వచ్చిన పాలలో పావుకప్పు కన్నా కొంచెం ఎక్కువ చక్కెర వేయండి. -పావు వంతు వచ్చేవరకు పాలను బాగా మరిగించిన తర్వాత అందులో 4 చుక్కుల నిమ్మ రసం పిండండి.
-పాలు గట్టిపడకుండా కొద్దిగా జ్యూసీ జ్యూసీగా ఉన్నప్పుడే అందులో పావు టీ స్పూన్ యాలకల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఈ పాలకోవాని ఓ బౌల్ లోకి తీసుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ప్రై చేసుకోడానికి సరిపేంత
ఆయిల్ అందులో పోసి వేడెక్కిన తర్వాత అందులో ముందుగా కలిపి పెట్టుకున్న
పిండిని ఒక్కో గెంట వేయండి.
-రెండు పక్కల లైట్ గా బంగారు రంగు వచ్చేవరకు కాల్చి వాటిలోని ఓ ప్లేట్
లోకి తీసుకోండి.
-ఇఫ్పుడు ముందుగా చేసుకున్న చక్కెర పాకంలో ఈ పూరి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసి రెండు పక్కల ఒక నిమిషం పాటు బాగా పట్టించండి.
-ఇఫ్పుడు ఒక ప్లేట్ లోకి ఆ పూరీని తీసుకొని అందులో బౌల్ లో పక్కన పెట్టి ఉంచిన పాలకోవాని కొంచెం పెట్టి మధ్యలోకి మడత పెట్టుకుంటే కోవా పూరీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications