Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Guntur Vankaya Bajji: గుంటూరు స్టైల్ వంకాయ బజ్జీ..చలికాలంలో వేడిగా తింటే స్వర్గమే
బజ్జీల్లో చాలా రకాలు ఉంటాయి. మిరపకాయ బజ్జీలు,అరటికాయ బజ్జీలు,క్యాప్సికమ్ బజ్జీలు,వంకాయ బజ్జీలు ఇలా చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా వంకాయ బజ్జీలు అన్ని చోట్లా దొరుకుతుంటాయి. అయితే గుంటూరులో రోడ్డు పక్కన టిఫిన్ షాపుల్లో లభించే వంకాయ బజ్జీల టేస్ట్ మాత్రం వేరే లెవల్. ఈ చలికాలంలో సాయంత్రం పూట వేడి వేడిగా వంకాయ బజ్జీలు తింటే స్వర్గమే. అయితే అదిరిపోయే టేస్ట్ ఉండే గుంటూరు స్ట్రీట్ స్టైల్ వంకాయ బజ్జీలను ఎలా తయారుచేసుకోవాలి,దీని తయారీకి ఏమేం పదార్థాలు కావాలనేది ఇప్పుడు చూద్దాం.
గుంటూరు వంకాయ బజ్జీ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-శెనగపిండి
-వంకాయ
-ఉప్పు
-బియ్యం పిండి
-సోడా పిండి
-నూనె
-నీరు
-కారం
-తెల్ల నువ్వులు
-చింతపండు
-ఉల్లిపాయ
-జీలకర్ర
-నిమ్మకాయ
-పెరుగు

-ముందుగా ఓ బౌల్ తీసుకొని అందులో అరకేజీ శెనగపిండి,రుచికి సరిపడా ఉప్పు,చిటికెడు సోడా పొడి,రెండు చెంచాలా బియ్యం పిండి వేసి బాగా ఉండలు లేకుండా కలపండి.
-ఇప్పుడు ఇందులో సరిపడా నీళ్లు కొంచెం కొంచెంగా పోస్తూ బాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా,మరీ లూజ్ గా కాకుండా బాగా కలుపుకొని దీన్ని ఓ పక్కన పెట్టుకోండి.
-ఇఫ్పుడు వంకాయ లోపల పెట్టడానికి అవసరమైన మసాలా సిద్దం చేసుకోవాలి. ఇందుకోసం కట్ చేసిన ఒక ఉల్లిపాయ,తెల్ల నువ్వులు 4 చెంచాలు,2 చెంచాల కారం,1 చెంచా జీలకర్ర,రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు మిక్సీలో లేదా రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. బాగా నలిగిన తర్వాత ఆ మసాలా ముద్దను ఓ కప్పులోకి తోడుకొని పక్కనబెట్టండి.
-ఇప్పుడు ఒక కప్పులో 1 చెంచా కారం వేసి అందులో నాలుగైదు నిమ్మకాయలను పిండుకోవాలి. బాగా ఉండలు లేకుండా కలపండి.
-ఇప్పుడు బాగా కడిగిన అరకేజీ లేత వంకాయలను ఓ ఫ్లేట్ లోకి తీసుకోండి.
-ఓ గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసి వంకాయలకు గాటు పెట్టి ఆ నీళ్లల్లో వేయండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి నూనె పోసి అది కొంచెం వేడయ్యాక అందులో ఈ వంకాయలను వేయండి. వంకాయలు 50 శాతం వేగాక తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న మసాలా ముద్దను తీసుకొని కొంచెం కొంచెంగా అన్ని వంకాయ గాట్లు లోపల పెట్టుకోండి.
-ఇప్పుడు మీడియం మంట మీద స్టవ్ మీద బాండీలో నూనె పెట్టి అది వేడయ్యాక అందులో ముందుగా కలిపి ఉంచుకున్న శెనగపిండిలో వంకాయలను ముంచుతూ బాండీలో వేయండి.
-అన్నీ బజ్జీలు ఒకే కలర్ కి వచ్చే వరకు వేయించుకోండి. వేడి వేడి వంకాయ బజ్జీ రెడీ.
-ఇప్పుడు వంకాయ బజ్జీకి సగానికి గాటు పెట్టి అందులో సన్నగా తరిగి ఉల్లిపాయలను వేసి దాని మీద ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మకారం వేసి,దాని మీద కొంచెం పెరుగు వేసుకొని తింటే ఆ టేస్ట్ కి 20 బజ్జీలు అయినా అవలీలగా తినేస్తారు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications