Latest Updates
-
నోట్లతో మేడలు, పలకరింపుల్లో ప్యాకేజీలు.. ఈనాటి బంధుత్వాల్లో కనుమరుగుతున్న ఆప్యాయతలు.! -
వర్షాకాలంలో తాగాల్సిన టీ ఇదే..అసలైన ఆరోగ్యం ఇందులోనే -
బెడ్ టీ లేదా కాఫీ తాగుతున్నారా.. ఆరోగ్యానికి కీడు చేసే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.! -
విహార యాత్రలో భయానక అనుభవం.. ఏకంగా 20 కి.మీ బైక్పై వెంబడించి రాడ్లతో దాడి.. వైరల్ వీడియో.! -
హిందూ దేవుళ్లు ఎప్పుడూ నీలం రంగులోనే ఎందుకు కనబడతారో తెలుసా? -
వర్షాకాలంలో ఈ కూరగాయలను కొనుగోలు చేసేముందు ఈ కీలక జాగ్రత్తలు తప్పనిసరి.! -
భయంకరమైన కాలసర్ప దోషం.. ఈ 4 రాశుల వారికి డేంజర్! -
బజ్జీలు, పకోడీలు వద్దు.. వర్షాకాలంలో రాగి సూప్ ఇలా చేసి తాగితే బోలెడు బెనిఫిట్స్ -
ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.? -
స్లీప్ మాక్సింగ్ అంటే ఏంటి? నిద్రపట్టక ఇబ్బంది పడుతునోళ్లకు ఇదెలా ఉపయోగపడుతుంది?
మట్టి కుండలో ఘుమఘుమలాడే మత్తి చేపల పులుసు.. ఈ పల్లెటూరి రుచికి ఫిదా అవ్వాల్సిందే!
సముద్రపు చేపలలో సార్డిన్స్ (తెలుగులో వీటిని మత్తి చేపలు లేదా కవ్వలు చేపలు అని కూడా అంటారు) కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. పరిమాణంలో ఇవి చిన్నవే అయినప్పటికీ, వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు పుష్కలంగా ఉండే ఈ చేపలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

అయితే మత్తి చేపలకు సహజంగానే కొద్దిగా నీచు వాసన ఎక్కువగా ఉంటుంది, అలాగే చిన్న ముళ్ళు కూడా ఉంటాయి. ఈ కారణాల వల్ల చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ ఒక్కసారి మన పల్లెటూరి అమ్మమ్మల కాలం నాటి సాంప్రదాయ పద్ధతిలో, మట్టి కుండలో ఈ చేపల పులుసును వండి చూడండి... చేపలు తినని వారు కూడా లొట్టలేసుకుంటూ తింటారు.
మత్తి చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు
సార్డిన్ చేపలు (మత్తి చేపలు) - అర కేజీ
సాంబార్ ఉల్లిపాయలు- 10
టమాటో - 1
పచ్చి మిరపకాయలు - 2
చింతపండు - ఒక పెద్ద నిమ్మకాయ సైజు
కారం పొడి - 4 టీస్పూన్లు
పసుపు పొడి - అర టీస్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
మెంతులు - 1 టీస్పూన్
నిమ్మకాయ - సగం
నూనె - పులుసుకు సరిపడా
కరివేపాకు - రెండు రెమ్మలు
కొత్తిమీర ఆకులు - తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
మత్తి చేపల పులుసు తయారీ విధానం
-మత్తి చేపల కూరకు అత్యంత కీలకమైనది వాటిని శుభ్రం చేయడం. ముందుగా చేపలను బాగు చేసుకుని రెండు మూడు సార్లు నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో చేపలను వేసి అందులో సగం నిమ్మచెక్క రసం, కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసి బాగా పట్టించి కడగాలి. ఇలా చేయడం వల్ల చేపల ఘాటైన నీచు వాసన పూర్తిగా పోతుంది.
-వేడి నీటిలో చింతపండును అరగంట పాటు నానబెట్టి, బాగా పిసికి చిక్కటి పులుసును తీసి పక్కన పెట్టుకోండి.
-పొయ్యి మీద మట్టి కుండ పెట్టి, తగినంత నూనె పోసి వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటలాడుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు కరివేపాకు, సన్నగా తరిగిన చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు వేసి వేయించాలి.
-టమాటాలు, ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత.. అందులో కారం, పసుపు వేసి నూనెలో ఒక నిమిషం పాటు కలపాలి. ఇప్పుడు ఒక అర కప్పు నీళ్లు పోసి, ఈ మసాలాను కొద్దిసేపు ఉడకనివ్వండి.
-మసాలా దగ్గరపడి నూనె పైకి తేలుతున్నప్పుడు, ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని, రుచికి సరిపడా ఉప్పును వేసి కలపాలి. పులుసు పచ్చి వాసన పోయేంత వరకు సుమారు 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.
-పులుసు బాగా మరిగి చిక్కబడుతూ నూనె పైకి తేలుతున్న సమయంలో.. శుభ్రం చేసి పెట్టుకున్న మత్తి చేపలను నిదానంగా పులుసులో వేయాలి. గరిటెతో ఎక్కువగా కలపకూడదు చేపలు విరిగిపోతాయి. మూత పెట్టి, మంటను మీడియంలో ఉంచి ఒక 10 నిమిషాలు ఉడికించండి.
-చేప మెత్తగా ఉడికిన తర్వాత, పైన సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను చల్లుకుని స్టవ్ ఆపేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే సాంప్రదాయ మత్తి చేపల పులుసు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications