Latest Updates
-
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి.. -
అందమైన అమ్మాయి పిలిచిందని అర్థరాత్రి రూమ్ కి వెళ్లిన బ్యాంక్ మేనేజర్..తర్వాత ఏమైందంటే..? -
జలుబు, దగ్గును తగ్గించే వెల్లుల్లి మిరియాల అన్నం..జస్ట్ 10 నిమిషాల్లోనే చేసుకోండిలా -
నవరాత్రుల్లో 2వ రోజు ప్రసాదం..శ్రీ గాయత్రీ దేవి నైవేద్యంగా రవ్వ పులిహోర.. ఇలా సింపుల్ గా చేయండి -
Navaratri 2026 Day 2: దసరా నవరాత్రులు 2వ రోజు.. బ్రహ్మచారిణి మాత పూజా విధానం, పురాణ గాథ, మంత్రాలు -
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే?
విహార యాత్రలో భయానక అనుభవం.. ఏకంగా 20 కి.మీ బైక్‌పై వెంబడించి రాడ్లతో దాడి.. వైరల్ వీడియో.!
కుటుంబంతో కలిసి సరదాగా గడిపేందుకు విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి భయానక అనుభవం ఎదురైంది. బైక్‌పై దుండగులు వెంబడించి దాదాపు 20 కి.మీ దూరం వారికి నరకం చూపించారు. కారు అద్దాలను పగలగొట్టడంతో పాటు వారిని గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే టూరిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన పర్యాటకుల భద్రతపై చర్చకి దారితీసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

యువతితో అసభ్యకర ప్రవర్తన
మహారాష్ట్రలోని నాసిక్‌లో విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. నాసిక్‌కి చెందిన ఓ కుటుంబంలో ఎనిమిది మంది ఇగత్‌పురి పట్టణంలో భావ్లీ డ్యామ్ వద్ద జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే కొందరు పోకిరీలు ఆ కుటుంబంలోని ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు కుటుంబీకులు ఆరోపించారు. దీంతో పోకిరీలను అడ్డుకునేందుకు కుటుంబీకులు యత్నించారు. అయితే సమీపంలోని దుకాణదారులు కూడా పోకిరీలతో కలిసి కుటుంబీకులతో గొడవకు దిగారు. ఏదో విధంగా ఆ సమస్య నుంచి బయటపడి తిరుగు పయనం అయ్యారు.
ఈ క్రమంలో కుటుంబీకులు కారులో తిరుగు పయనం అవుతుండగా.. ఆగ్రహంతో ఉన్న పోకిరీలు ఆ విషయాన్ని అక్కడితో వదిలేయలేదు. వారంతా బైక్‌లు తీసుకుని కారును వెంబడించారు. అలా కాసేపు వెంబడించి వదిలేయలేదు. చేతుల్లో రాడ్లు పట్టుకుని ఏకంగా 20 కి.మీ వారిని ఫాలో అయ్యారు. అప్పటికే వారు వెంబడించడంతో భయాందోళనతో ఉన్న కుటుంబీకులు కారు స్పీడ్‌ను పెంచారు.
పోకిరీల విధ్వంసం
అయినా సరే పోకిరీలు వెనక్కి తగ్గలేదు. వారిని ఫాలో అవుతూ దగ్గరికి చేరుకోగానే చేతిలోని రాడ్లు, కర్రలతో కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో కారులోని పలువురు మహిళలకు గాయాలయ్యాయి. అందులోని చిన్న పిల్లలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలను కారులో ఉన్న వారు వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు, వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడికి 9 మంది పాల్పడినట్లుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని.. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దాడికి పాల్పడిన దృశ్యాలను నెటిజన్లను భయాందోళనకి గురిచేస్తున్నాయి.
నెటిజన్స్ కామెంట్స్
కుటుంబీకులు, ఫ్రెండ్స్‌తో కలిసి ఖాళీ సమయాల్లో సరదాగా గడిపేందుకు వెళితే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టుల భద్రతపై ప్రభుత్వం, అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రద్దీగా ఉండే ప్రముఖ ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ ఉండాలని సూచిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా చూడాలని కోరుతున్నారు. నడిరోడ్డుపై పోకిరీలు ఇలాంటి చర్యలకు పాల్పడటం దురదృష్టకరమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. వర్షాకాలంలో బీచ్‌లు, డ్యామ్‌లు, జలపాతాలకు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్న కారణంగా అధికారులు అందుకు అనుగుణంగా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ కోరుతున్నారు.



Click it and Unblock the Notifications
