Latest Updates
-
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం!
ఆషాఢం ప్రారంభం.. ఈ మాసంలో ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, హిందూ సంప్రదాయ నియమాలేంటి.?
నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమైంది. జులై 15 నుంచి ఆగష్టు 12 వరకు ఈ మాసం కొనసాగుతుంది. హిందూ సంప్రదాయంలో ఆషాఢం అనగానే మొదటిగా కొత్తగా పెళ్లయిన జంటలు దూరంగా ఉండాలని పెద్దలు నియమం తీసుకురావడం గుర్తొస్తుంది. తర్వాత ఈ మాసాన్ని శూన్య మాసంగా పిలుస్తారు. కాల గమనానికి, బుుతు మార్పులకు అనుగుణంగా ఇంకా ఆషాఢంలో చాలా ఆధ్యాత్మిక విశేషాలు, కట్టుబాట్లే ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం..

జులై 15 పాడ్యమి తిథి నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆగష్టు 12 అమావాస్యతో ముగుస్తుంది. ఆధ్యాత్మికంగా, కాలానుగుణంగా, బుుతు మార్పులతో ఈ మాసంలో కొన్ని కట్టుబాట్లు, నియమాలు పాటించాలని హిందూ సంప్రదాయం చెబుతోంది. ఈ క్రమంలోనే ఆషాఢంలో వివాహాలకు ముహూర్తాలు ఉండవు. గృహ ప్రవేశాలు, ఉప నయనాలు, పుట్టు వెంట్రుకలు తీయడం, వ్యాపారాలు ప్రారంభించడం ఇంకా ఇతర శుభకార్యాలకి ఈ మాసంలో జరగవు. అందుకే ఈ మాసాన్ని శూన్య మాసంగా, మూఢంగా పెద్దలు చెబుతారు.

ఆషాఢ బోనాలు
అయితే ఆధ్యాత్మిక పరంగా దైవారాధాన, జపం, తపస్సు, వ్రతాలు, ఇతర పూజలకు ఈ మాసం శ్రేష్ఠమైనదని పండితులు పేర్కొంటున్నారు. ఈ మాసం దక్షిణాయాన ప్రారంభాన్ని సూచిస్తుందని చెబుతున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో గ్రామ దేవతలకు, అమ్మవార్లకు బోనాలు ఆషాఢం నుంచి ప్రారంభమవుతాయి. భక్తిశ్రద్లలతో, డోలు చప్పుళ్లతో అమ్మవారికి చీరా, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.
తొలి ఏకాదశి
ఇక ఆషాఢ మాసంలో మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉంది. విష్ణుమూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే తొలి ఏకాదశి(శయన ఏకాదశి) ఈ మాసంలోనే వస్తుంది. జులైన 25న తొలి ఏకాదశి నాడు విష్ణుమార్తిని ఆరాధిస్తారు. ఈ పర్వదినాన శ్రీ మహా విష్ణువు క్షీర సాగరంలో శేష తల్పంపై యోగ నిద్రలోకి వెళ్తారని భక్తులు విశ్వసిస్తారు. దేవతా మూర్తులు నిద్రావస్థలో ఉండే ఈ సమయంలో శుభకార్యాలు చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఉండవని చెబుతారు. అందుకే శుభకార్యాల కంటే ఆధ్యాత్మిక చింతన ప్రయోజనం చేకూరుస్తుందని పండితులు చెబుతారు. ఇక, తొలి ఏకాదశి నాడు భగవంతుని ధ్యానంలో ఉపాసనలు, ఉపవాసాలు చేస్తే శుభం కలుగుతుందని చెబుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేస్తే పుణ్యం ఫలం లభిస్తుందని అంటారు.

ఆషాఢంలో గోరింటాకు
ఆధ్యాత్మికపరంగానే కాకుండా ఈ మాసం ఆరోగ్య, సామాజిక పరంగా కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. వేసవి తాపం నుంచి బయటపడి వర్షాకాలంలో ప్రవేశించగానే సూర్యుని గమనం వల్ల వాతావరణంలో మార్పులు జరుగుతాయి. వర్షాలు, వాతావరణంలో అధిక తేమ, బురద కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకే వీటి బారి నుంచి కాపాడుకునేందుకు ముందుగా శరీర బాహ్య సంరక్షణ అవసరం. ఈ క్రమంలో ఆషాఢంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. అది అనాదిగా సంప్రదాయంగా వస్తోంది.
కారణాలివే..
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటే ఎంతో ప్రయోజనం ఉంది. అందులోని ఔషధ గుణాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ఈ కాలంలో వచ్చే చర్మ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వ్యవసాయం పరంగా చూస్తే ఈ మాసంలో రైతులు ఎక్కువగా సాగు పనుల్లో బిజీగా గడుపుతారు. అందుకే ఈ మాసంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు నిర్వహిస్తే ప్రయాణ రాకపోకలకి ఇబ్బందిగా ఉంటుందని మన పూర్వీకులు ఈ నియమం తీసుకొచ్చారు.
కొత్త దంపతులు
ఆషాఢం ప్రారంభం అయ్యాక కొత్త దంపతులను విడిగా ఉంచే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. అందుకే వధువును పుట్టింటికి తీసుకెళతారు. ఈ నెల రోజుల పాటు దూరంగా ఉంచుతారు. అంతే కాకుండా అత్తాకోడళ్లు ఒకే గడప దాటకూడదని చెబుతారు. ఈ సంప్రదాయాన్ని నేటీకి పాటిస్తారు. ఇందులో శాస్త్రీయ, వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. ఆషాఢంలో మహిళ గర్భం దాల్చితే తొమ్మిది నెలల తర్వాత వేసవిలో ప్రసవం ఉంటుంది. వేసవిలో వేడి కారణంగా బాలింతలకు, నవజాత శిశువులకు శ్రేయస్కరం కాదని ఈ ఆచారాన్ని మన పెద్దలు తీసుకొచ్చారు. మరో కారణాన్ని చూసుకుంటే.. పూర్వంలో వ్యవసాయ సంబంధిత పనులపైనే జనజీవనం సాగేది. మగవారు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండి, అలసిపోవడం కారణంగా భార్యతో గడిపే సమయం తక్కువ. అందుకే అత్తామామలు కోడలిని పుట్టింటికి పంపిస్తారు.



Click it and Unblock the Notifications
