Bajra Idli:100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలంటే ఈ మిల్లెట్ ఇడ్లీ వారానికోసారైనా తినాలి..ఎలా చేసుకోవాలంటే

Posted By:

మన తెలుగు ప్రజలు ఎక్కువగా తినే బ్రేక్ ఫాస్ట్ లలో ఇడ్లీ ప్రధానమైనది. అయితే ఎక్కవగా తెల్ల ఇడ్లీనే తింటుంటారు. అయితే రెగ్యులర్ గా అవే ఇడ్లీ తిని తిని కొందరికి బోర్ కొట్టేస్తుంటది? అయితే ఇళ్లల్లో మాత్రం అమ్మలు ఆరోగ్యానికి మంచిది అని ఇడ్లీనే ఎక్కువగా తయారుచేస్తుంటారు. అయితే మీ ఇళ్లల్లో కూడా పిల్లలు,పెద్దలు ఇడ్లీ బోర్ కొడుతుంది తినబుద్ది కావట్లేదు అంటుంటే టేస్టీగా అదే సమయంలో ఆరోగ్యానికి మేలుచేసేలా సజ్జ ఇడ్లీ చేసి పెట్టండి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ చేసిపెట్టాలని బతిమాలతారు.

సజ్జలలో ఐరన్, జింక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు ఉక్కులా బలంగా మారుతాయి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మలబద్దకం సమస్య ఉన్నోళ్లకి, డైట్ ఫాలో అయ్యేవాళ్లకి సజ్జలతో చేసిన ఇడ్లీ చాలా మేలు చేస్తుంది. టేస్టీగా,మెత్తడి దూదిలాంటి సజ్జ ఇడ్లీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Healthier Breakfast Sajja Idli Recipe in Telugu

సజ్జ ఇడ్లీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపగుళ్లు
-సజ్జ రవ్వ
-ఉప్పు
-వంటసోడా

అమ్మమ్మ రుచుల జ్ఞాపకం..నోరూరించే కొబ్బరి పాల అప్పాలు..ఎలా చేసుకోవాలంటే

సజ్జ ఇడ్లీ తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు మినపగుళ్లు వేసి నీళ్లు పోసి రెండుసార్లు శుభ్రంగా కడగండి.
- తర్వాత నీళ్లు పోసి 4-5 గంటలు నానబెట్టుకోవాలి.
- తర్వాత నానిన మినపగుళ్లలోని నీటిని 90శాతం వంపేసి మిగతావాటిని మినపగుళ్లతో సహా మిక్సీ గిన్నెలో వేసి వీలైనంత సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి.

-తర్వాత ఓ పెద్ద గిన్నెలో 2 గ్లాసుల సజ్జ రవ్వ పోసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసి సజ్జ రవ్వను పక్కనపెట్టుకోండి.

-ఇప్పుడు ఓ హాట్ బాక్స్ లేదా పెద్ద గిన్నెలో గ్రైండ్ చేసుకున్న పిండిని, కడిగిన సజ్జ రవ్వను వేసి బాగా కలిసేలా కలిపి మూతపెట్టేసి రాత్రంతా లేదా 7-8 గంటలు పక్కన ఉంచాలి.

-తర్వాత మూత తీసి పులిసిన పిండి ఒకసారి కలిపి అందులో రుచికి సరిపడా ఉప్పు, పావు టీస్పూన్ వంటసోడా వేసి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకొని కలపండి.

-ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి పిండిని పెట్టి ఉడికించుకోవాలి. అంతే సజ్జ ఇడ్లీ రెడీ. దీనిని నచ్చిన చట్నీతో లేదా కారం పొడులతో తింటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది.

కొన్ని ప్రయోజనాలు

సజ్జ ఇడ్లీలు రుచికరమైనవే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. మీ దినచర్యలో వీటిని చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. సజ్జల్లో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గి, బరువు అదుపులో ఉంటుంది. అదేవిధంగా సజ్జల్లో ఉండే ప్రోటీన్ కండరాల నిర్మాణానికి, కణజాల మరమ్మత్తుకు సహాయపడుతుంది. సజ్జ పిండి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీనివల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యల నుండి రక్షణ పొందవచ్చు. సజ్జలకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి కాబట్టి షుగర్ పేషెంట్లకు ఇవి చాలా మంచివి. సజ్జల్లో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెపోటు, స్ట్రోక్ వంటి వాటిని నివారించడంలో తోడ్పడతాయి

[ of 5 - Users]
Story first published: Monday, June 16, 2025, 11:58 [IST]
Desktop Bottom Promotion