గణేశ్‌ చతుర్థి స్పెషల్‌: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!

గణేశ్‌ చతుర్థి సందర్భంగా గణనాథుడికి పూజలో ఆయనకు ప్రీతికరమైన నైవేద్యాలు సమర్పిస్తాం. కుడుములు, ఉండ్రాళ్లు, మోదకాలు, పాయసం, పులిహోర ఇలా రకరకాలుగా ఎంతో కాలంగా సంప్రదాయబద్ధంగా వస్తున్న ప్రసాదాలను చేయడం తెలిసిందే. అయితే ఏదైనా కొత్తరకంగా నైవేద్యం చేయాలంటే మాత్రం భయపడిపోతారు. పండుగ పూట సరిగా కుదరకపోతే ఎలా.. టైం వేస్ట్‌ అయిపోతుందనే ఆందోళనతో ప్రయోగాలకు దూరంగా ఉంటారు. కానీ భయపడకండి. ఈ సారి మీ ఇంటి గణపతికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం చేయండి. ఆయనకు ఇష్టమైన మోదకాలను కొత్తగా పచ్చి శనగపప్పుతో ఈ పర్ఫెక్ట్‌ కొలతలతో చేశారంటే రుచికరంగా ఉండటమే కాకుండా వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి. శనగపప్పు మోదకాలను ఎలా తయారుచేయాలో చూద్దాం..

Ganesh chaturthi special pachi senagapappu modakalu with perfect process

పచ్చి శనగపప్పు మోదకాల తయారీకి కావాల్సిన పదార్థాలు

పచ్చిశనగపప్పు- కప్పు
నూనె- డీప్‌ ఫ్రైకి సరిపడా
చక్కెర- ఒకటి పావు కప్పు
ఏలకుల పొడి- పావు టీస్పూన్‌
కుంకుమ పువ్వు- చిటికెడు
యెల్లో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌- చిటికెడు
నెయ్యి- టేబుల్‌ స్పూన్‌

పచ్చి శనగపప్పు మోదకాల తయారీ విధానం

వినాయక చవితి స్పెషల్‌: గణనాథుడికి కారం ఉండ్రాళ్లు.. త్వరగా, పర్ఫెక్ట్‌గా రావాలంటే ఇలా చేయండి.!

గణపతికి ఇష్టమైన మోదకాలను పండుగ పూట తప్పనిసరిగా చేయాల్సిందే కదా.. ఇక పచ్చి శనగపప్పు మోదకాల తయారీ కోసం ముందుగా దీనిని రెండు సార్లు కడిగి కనీసం రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి.

Ganesh chaturthi special pachi senagapappu modakalu with perfect process

తర్వాత మిక్సీలో వేసి సాధ్యమైనంత తక్కువగా నీళ్లు పోసి సన్నని రవ్వ మాదిరిగా గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత ఈ పిండి ముద్దను బౌల్‌లోకి తీసుకుని చిన్న ముద్దలుగా చేతిలోకి తీసుకుని వడల మాదిరిగా ఒత్తుకోవాలి. వీటన్నిటినీ నూనెలో లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.

ఈ వడలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు పాకం కోసం స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో చక్కెర వేసి ముప్పావు కప్పు నీళ్లు పోసి కరగనివ్వండి. కొబ్బరి నూనె జిగురు పాకం వచ్చేవరకు మరిగించుకోవాలి. మరిగేటప్పుడు ఇందులో కొద్దిగా కుంకుమ పుప్పు, ఏలకుల పొడి, యెల్లో ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌ వేసి కలపండి.

Ganesh chaturthi special pachi senagapappu modakalu with perfect process

పాకం అయ్యేలోపు చల్లారిన శనగపప్పు వడలను మిక్సీలో వేసి పొడిలా రుబ్బుకోండి. ఈ పిండిని పాకం అయిన తర్వాత అందులో వేసి ఉండలు కట్టకుండా గరిటెతో మొత్తం కలియతిప్పండి. ఈ పిండి మొత్తం పాకంలో కలిసిపోయి గట్టిగా ఉడికిన తర్వాత గరిటె సాయంతో పాన్‌కి వెడల్పుగా పరిచి స్టవ్‌ ఆఫ్‌ చేసి మూడు లేదా నాలుగు గంటల పాటు చల్లారనివ్వండి.

లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!

నాలుగు గంటల తర్వాత చల్లారిన ఇందులో కొద్దిగా నెయ్యి, కట్‌ చేసిన జీడిపప్పు పలుకులు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మోదకాలు తయారుచేసే అచ్చును తీసుకుని లొపల కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోండి. ఈ పిండి ముద్దను అందులో వీలైనంత గట్టిగా ఒత్తుతూ మోదకాలు తయారుచేసుకోండి.

పచ్చి శనగపప్పు మోదకాలు రెడీ. ఈ పద్ధతిలో, కొలతలతో చేశారంటే రుచిగా ఉండటంతో పాటు వారం రోజులకి పైగా నిల్వ ఉంటాయి. మీ ఇంటి గణేశుడి పూజను ప్రత్యేక నైవేద్యంతో భక్తిరస పారవశ్యంతో చేసుకోండి.

[ of 5 - Users]
Story first published: Sunday, September 13, 2026, 14:00 [IST]
Desktop Bottom Promotion