వినాయక చవితి స్పెషల్‌: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!

వినాయక చవితి పండుగ సందర్భంగా గణనాథుడికి ఇష్టమైన మోదకాలు తప్పనిసరిగా చేస్తూనే ఉంటాం. అయితే వీటిని సాధారణంగా బియ్యం పిండితో చేస్తుంటాం. కానీ ఎప్పుడైనా రవ్వతో చేశారా. స్టీమింగ్‌ చేసే పని లేకుండా ఈ రవ్వ మోదకాలు ఈజీగా చేసుకోవచ్చు. బియ్యం పిండి అందుబాటులో లేకపోతే ఇలా సులభంగా, రుచికరంగా బొంబాయి రవ్వతో మోదకాలు ట్రై చేయండి. ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా చేసుకోగలిగేలా ఈ టిప్స్‌ పాటించండి.

Ganesh chaturthi special Rava modakalu recipe ingredients and process

రవ్వ మోదకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు

తరిగిన బాదం- టేబుల్‌ స్పూన్‌
తరిగిన పిస్తా- టేబుల్‌ స్పూన్‌
తరిగిన జీడిపప్పు- టేబుల్‌ స్పూన్‌
బొంబాయి రవ్వ- కప్పు
నెయ్యి- మూడు టీ స్పూన్లు
పచ్చి కొబ్బరి తురుము- అర కప్పు
పాలు- అర కప్పు
చక్కెర- అర కప్పు
ఏలకుల పొడి- అర టీస్పూన్‌

రవ్వ మోదకాలు తయారీ విధానం

గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!

ముందుగా స్టవ్‌పైన పాన్‌ పెట్టి అందులో తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బొంబాయి రవ్వను వేసి చిన్న మంటపైన నాలుగు నిమిషాల పాటు రోస్ట్‌ చేసుకోవాలి. ఈ సమయంలో మూడు టీస్పూన్ల నెయ్యి వేసి మరికాసేపు వేగనివ్వాలి.

నెయ్యిలో మొత్తం కలిసి కమ్మటి వాసన వస్తున్నప్పుడు అర కప్పు తరిగిన పచ్చి కొబ్బరి తురుము వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు అర కప్పు కాచిన పాలు, అర కప్పు పంచదార వేసి బాగా కలిపి ఉడికించుకోవాలి. అందుబాటులో ఉంటే కొంచెం కుంకుమ పువ్వు కలిపిన నీళ్లు కూడా పోసుకోవచ్చు. మిశ్రమం అంతా బాగా ఉడికి అడుగు అండుతున్నప్పుడు మిగిలిన పాలు పోసి కలపండి.

Ganesh chaturthi special Rava modakalu recipe ingredients and process

మిశ్రమం సాఫ్ట్‌గా అయిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోండి. ఒక ప్లేట్‌లోకి తీసుకుని అందులో అరటీస్పూన్‌ ఏలకుల పొడి వేసుకోవాలి. తర్వాత మొత్తం కలిసేలా మరోసారి కలుపుకోండి.

గణేశ్‌ చతుర్థి స్పెషల్‌: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.!

ఇప్పుడు అరచేతిలోకి కొంచెం పిండి ముద్దను తీసుకుని బూరెల మాదిరిగా ఒత్తుకొని మధ్యలో కొన్ని డ్రైఫ్రూట్స్‌ పెట్టుకుని మోదకాల మాదిరిగా చేసుకోండి. లేదా మోదకాలు తయారుచేసే అచ్చులో వేసుకుని అయినా ఒత్తుకోవచ్చు. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. ఎంతో సింపుల్‌గా రవ్వ మోదకాలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, September 14, 2026, 6:31 [IST]
Desktop Bottom Promotion