Latest Updates
-
రోజువారీ ఆహారంలో వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారా.?.. మీ కిడ్నీలు రిస్క్‌లో పడినట్లే.! -
ప్రేమకు, పెళ్లికి జెన్ జీ యువత ఎందుకు దూరమవుతోంది? -
భాగస్వామి ఎంపిక విషయంలో పదే పదే తప్పు చేస్తున్నారా.. మిమ్మల్ని ఇరకాటంలో పెట్టే విషయాలివే.! -
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం!
కుక్కర్ లో చిటికెలో ఘుమఘుమలాడే బీట్ రూట్ బిర్యానీ..రంగు అదిరింది.. రుచి మోత మోగింది!
బిర్యానీ పేరు వింటేనే చాలు..చాలామంది నోట్లో నీళ్లు ఊరుతాయి. నాన్ వెజ్ ప్రియులకు చికెన్, మటన్ బిర్యానీలు ఎలాగో.. వెజ్ తినే వారికి వెజ్ బిర్యానీ అంత ఇష్టం. అయితే ఎప్పుడూ ఒకే రకమైన వెజిటబుల్ బిర్యానీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కొత్తగా బీట్ రూట్ బిర్యానీ ట్రై చేయండి.
రంగురంగుల కూరగాయలతో చేసే బిర్యానీలో, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీట్ రూట్ ని ప్రధానంగా వాడితే ఆ రుచే వేరు. సాధారణంగా పిల్లలు బీట్ రూట్ తినడానికి మారం చేస్తుంటారు. కానీ, ఇలా బిర్యానీ చేసి పెడితే లొట్టలేసుకుంటూ తింటారు. చూడటానికి ఎర్రగా, తినడానికి కమ్మగా ఉండే ఈ బీట్ రూట్ బిర్యానీని ఇంట్లో కుక్కర్ లోనే ఈజీగా తయారు చేసుకోడాినికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం: 1 కప్పు
బీట్ రూట్: 1
ఉల్లిపాయ: 1
టమాటో: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
పచ్చి మిరపకాయలు: 2
పుదీనా, కొత్తిమీర: గుప్పెడు
బిర్యానీ మసాలా దినుసులు: లవంగాలు, దాల్చిన చెక్క, ఏలకులు, అనాస
పువ్వు, బిర్యానీ ఆకు, రాతి మొగ్గ.
బిర్యానీ పౌడర్: 1 టీస్పూన్
కారం: రుచికి సరిపడా
ఉప్పు: తగినంత
నూనె,నెయ్యి: సరిపడా
తయారీ విధానం
-ముందుగా బియ్యంని పావు గంట సేపు నీటిలో నానబెట్టాలి.
-తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి, అందులో కొద్దిగా నూనె, నెయ్యి వేసి వేడయ్యాక ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, రాతి మొగ్గ వేసి వేయించాలి. సువాసన వస్తున్నప్పుడు సన్నగా,పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి టమాటో మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు బీట్ రూట్ ముక్కలను కుక్కర్ లో వేయాలి. ఇందులోనే కారం, బిర్యానీ మసాలా పౌడర్ వేసి మొత్తం బాగా కలపాలి. ఒక రెండు నిమిషాల పాటు ముక్కలను నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత 2 చెంచాల పెరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. దీనివల్ల బిర్యానీకి మంచి రుచి, ఆకృతి వస్తుంది.
-బీట్ రూట్ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పావు గంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
-2 విజిల్స్ రాగానే స్టవ్ ఆపేయండి. ఆవిరి మొత్తం పోయాక మూత తీసి చూస్తే.. ఘుమఘుమలాడే ఎర్రటి బీట్ రూట్ బిర్యానీ రెడీ.
-రైతాతో వేడివేడిగా తింటే అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications