Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
ఉసిరితో ఇలా పులిహోర చేస్తే..ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారు!
భారతీయ సంప్రదాయ వంటకాలలో ఉసిరికాయకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయుర్వేదంలో ఉసిరిని అమృతఫలం అని పిలుస్తారు. కార్తీకమాసంలో ఉసిరికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆహారంలో కూడా ఉసిరిని ఎక్కువగా తీసుకుంటారు.
రుచికి వగరుగా, పుల్లగా ఉండే ఉసిరికాయతో చేసే పులిహోర అత్యంత రుచికరంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి సంజీవనిలా పనిచేస్తుంది. ఉసిరికాయ పులిహోర తయారీ చాలా సులభం. నిమ్మకాయ పులిహోర లాగానే ఉంటుంది కానీ, నిమ్మరసం బదులు ఉసిరికాయ తురుము లేదా గుజ్జును ఉపయోగిస్తాం. ఉసిరికాయ పులిహోర టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-ఆవాలు
-జీలకర్ర
-ధనియాలు
-మిరియాలు
-నువ్వులు
-పచ్చిశెనగపప్పు
-పల్లీలు
-ఎండుమిర్చి
-పచ్చిమిర్చి
-ఇంగువ
-కరివేపాకు
-ఉసిరికాయ
-ఆయిల్
-నిమ్మరసం
-కొత్తిమీర
తయారీ విధానం
-ముందుగా కుక్కర్ లో 1 గ్లాసు బియ్యం(250గ్రా)బియ్యం వేసి నీళ్లు పోసి రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
-తర్వాత కుక్కర్ లో ఒకటిన్నర గ్లాసు నీళ్లు, 2 టీస్పూన్ల ఆయిల్ వేయండి. కుక్కర్ మూతపెట్టి స్టవ్ మీద పెట్టి 2-3 విజిల్స్ వచ్చేదాకా పెద్ద మంట మీద ఉడికించాలి.
-ఉడికించిన అన్నాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు 6 ఉసిరికాయలను శుభ్రంగా కడిగి వాటిని చాకుతొ నీటుగా ముక్కలు కట్ చేసుకోండి. విత్తనాలు పడేయండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో అర టీస్పూన్ మిరియాలు, 1 టీస్పూన్ ధనియాలు, 1 టీస్పూన్ నువ్వులు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసి ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మిక్సీ గిన్నెలో కట్ చేసిన ఉసిరికాయ ముక్కలు వేసి గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా పేస్ట్ లా కాకుండా కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకొని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ లేదా పాన్ పెట్టి అందులో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేశాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి కాస్త వేగాక ఇందులో 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, 1 టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ ఆవాలు జీలకర్ర వేసి దోరగా వేయించాలి.
-ఇప్పుడు అందులో 3 ఎండుమిరపకాయల ముక్కలు, పొడవుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపుని బాగా ఫ్రై చేశాక ఇందులో పావు టీస్పూన్ ఇంగువ, పావు టీస్పూన్ పసుపు వేసి కలపాలి.
-వేగిన తాలింపులో గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి కలపాలి. ఉసిరికాయ తురుముని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అంతా కలిసేలా కలిపాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు నువ్వుల మిరియాల పొడిని,రుచికి తగిన ఉప్పు కూడా వేసి 1 నిమిషం కలుపుతూ వేయించాలి.
-ఇప్పుడు అందులోఉడికించిన అన్నం వేసి మొత్తం బాగా కలిసేలా కలిపాక స్టవ్ ఆపేయండి. అంతే ఉసిరికాయ పులిహోర రెడీ.
-రెడీ అయిన ఉసిరికాయ పులిహోరలో కొత్తిమీర తరుగు, అరచెక్క నిమ్మరసం పిండి కలుపుకోండి. దీంతో ఉసిరికాయలోని వగరు బ్యాలెన్స్ అయ్యి మంచి రుచి వస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












