Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Saggubiyyam Khichdi: ఉపవాసం స్పెషల్..ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని రుచి,ఎలా చేయాలంటే..
సగ్గుబియ్యంతో పాయసమే కాదు కిచిడీ కూడా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచి కూడా యమాగా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంటది. ముఖ్యంగా ఉపవాస దీక్షలో ఉండేవాళ్లకు అనుకూలమైన అల్పాహారం ఇది. నార్త్ ఇండియాలో ఉపవాసాల సమయంలో తేలికగా తినే ఆహారాలలో సగ్గుబియ్యం కిచిడి ఒకటి. కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండే ఈ అల్పాహారం బరువు తగ్గాలనుకునేవారికి కూడా బెస్ట్ గా ఉంటుంది. సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
సగ్గుబియ్యం కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
-సగ్గుబియ్యం
-ఆయిల్
-వేరుశెనగ పప్పు
-నిమ్మ రసం
-చక్కెర
-నల్ల మిరియాల పొడి
-కొత్తిమీర
-పచ్చిమిర్చి పేస్ట్
-బంగాళ దుంప ముక్కలు
-కరివేపాకు
-ఉప్పు

సగ్గుబియ్యం తయారీ విధానం
-1 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి అందులో అరకప్పు నీళ్లు పోసి 4 గంటల పాటు నాననివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి దాని మీద పావు కప్పు శెనగపప్పు వేసి ఎర్రగా వేయించి దాని పొట్టు తీసి కచ్చాపచ్చాగా దంచుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి అది వేడయ్యాక అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తర్వాత అందులోనే పొట్టు తీసి చిన్నగా కట్ చేసిన అరకప్పు బంగాళదుంప ముక్కలు, కరివేపాకు వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి.
-కొంచెం మగ్గిన ఆలూలో 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్,రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి.
-ఆలూ మెత్తబడిన తర్వాత అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం, 1 టీస్పూన్ చక్కెర వేసి రంగు తేలికపడే వరకు మూతపెట్టి మగ్గనివ్వండి.
-తర్వాత అందులో దంచుకున్న పల్లీలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, మిరియాల పొడి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే రుచికరమైన సగ్గుబియ్యం కిచిడి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications