Latest Updates
-
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.!
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, చపాతీలే గుర్తొస్తాయా? అయితే రొటీన్ కు భిన్నంగా ఒక్కసారి రైస్ రోటీ ట్రై చేసి చూడండి. హోటల్ లో దొరికే సాఫ్ట్ అండ్ టేస్టీ రైస్ రోటీని మీ ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటకలో అక్కి రోటీ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన సాంప్రదాయక చిరుతిండి. బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే కాదు సాయంత్రం స్నాక్ గా కూడా దీనిని లాగించేయవచ్చు.
కేవలం బియ్యం పిండితోనే కాకుండా ఇందులో రకరకాల తాజా కూరగాయలు కలపడం వల్ల ఇది పోషకాల గనిలా మారుతుంది. చాలా తక్కువ నూనె వాడటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి, డైట్ చేసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉదయాన్నే ఇది తింటే.. రోజంతా ఎంతో ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. కర్ణాటక స్టైల్ అక్కి రోటి మీ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

అక్కి రోటి తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం పిండి - 1 కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2 (మీ కారానికి తగినట్లుగా)
తురిమిన క్యారెట్, దోసకాయ, క్యాబేజీ - అర కప్పు చొప్పున
కొత్తిమీర - కొద్దిగా
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినన్ని
నూనె లేదా నెయ్యి - రోటీ కాల్చుకోవడానికి
తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ఒక కప్పు బియ్యం పిండి వేయండి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, తురిమిన క్యారెట్, దోసకాయ, కొత్తిమీర,జీలకర్ర, ఉప్పు వేసి కలపండి.
ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని ముద్దలా కలుపుకోవాలి. పిండి చపాతీ పిండిలా గట్టిగా అస్సలు ఉండకూడదు. చేతితో సులభంగా ఒత్తుకోవడానికి వీలుగా, కాస్త మెత్తగానే పిసికి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం వేడి చేయండి. వేడెక్కాక మంటను సిమ్ లోపెట్టండి. మీ చేతులను కొద్దిగా నీటితో తడుపుకుని, కలుపుకున్న పిండిలోంచి ఒక చిన్న ముద్దను తీసుకుని.. నేరుగా పెనం మీద పెట్టి వృత్తాకారంలో పల్చగా తట్టండి. ఒకవేళ నేరుగా పెనం మీద తట్టడం కష్టంగా అనిపిస్తే.. బటర్ పేపర్ లేదా ప్లాస్టిక్ కవర్ మీద తట్టి, ఆ తర్వాత పెనం మీద వేసుకోవచ్చు.
రోటీ చుట్టూ, అలాగే మధ్యలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయండి. మీడియం మంట మీద రెండు వైపులా అద్భుతమైన బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చుకోండి. మీకు కరకరలాడే (క్రిస్పీ) రోటీ కావాలంటే మరో నిమిషం పాటు అదనంగా కాల్చుకుంటే సరిపోతుంది.
అంతే వేడి వేడి, కమ్మని అక్కి రోటి రెడీ. దీనిని పల్లీల చట్నీ , వెన్న, పెరుగు లేదా కారంగా ఉండే ఎర్ర చట్నీతో వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
