Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
ఒక్క ఆలూ,ఒక్క గుడ్డు చాలు.. 5 నిమిషాల్లో టేస్టీ బ్రేక్ ఫాస్ట్..ఇలా చేయండి
సాధారణంగా మనలో చాలామంది పొద్దున్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఇడ్లీ,దోశ,పూరీ,బోండానే ఎక్కువగా తీసుకుంటారు. అయితే కొందరు మిల్లెట్స్ తో చేసిన ఇడ్లీ, దోశలు,పొంగలి వంటివి తింటుంటారు. అయితే రోజూ ఇవి తిని తిని చాలామందికి బోర్ కొట్టేస్తుంటది. అలాంటివాళ్లు కొత్తగా ఏదైనా ట్రై చెయ్యాలి అనుకుంటే పొటాటో ఎగ్ రెసిపి ఖచ్చితంగా ట్రై చేసి తీరాల్సిందే. టేస్ట్ అదిరిపోతుంది అంతే. ఈ రెసిపి కోసం మీద కేవలం ఒక బంగాళదుంప, ఒక కోడిగుడ్డు ఉంటే చాలు. 5 నిమిషాల్లోనే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఈ రెసిపిని చేసుకోవచ్చు. ఒక్క బంగాళదుంప, ఒక్క కోడిగుడ్డుతో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-బంగాళదుంప
-కోడిగుడ్డు
-మైదాపిండి
-ఉప్పు
-ఆయిల్

తయారీ విధానం
-ముందుగా ఒక బంగాళదుంప తీసుకొని దానిని శుభ్రంగా కడిగి దానిమీద
చెక్కునంతా తీసేయాలి.
-చెక్కు తీసిన బంగాళదుంపను చాకుతో చాలా సన్నని పొడవాటి ముక్కలుగా కట్ చేసుకోండి.
-ఇప్పుడు ఓ బౌల్ తీసుకొని అందులో బంగాళదుంప ముక్కలు వేసి అందులోనే 1 కోడిగుడ్డు కొట్టి వేయాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసి మొత్తం కలిసేలా అన్నింటిని బాగా కలపాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఆయిల్ ని బ్రష్ తో అలా రుద్ది వేడి చెయ్యండి. పాన్ వేడయ్యాక అందులో బౌల్ లో కలిపి ఉంచిన మిశ్రమాన్ని వేయండి. దోశ లేదా ఆమ్లెట్ మాదిరిగా దానిని గరిటతో పరచండి. పాన్ మీద మూతపెట్టి 3 నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి.
-తర్వాత మూత తీసి అందులోని అట్టుని గరిటతో రెండో వైపుకి తిప్పి మూతపెట్టి మరో 2 నిమిషాలు కాలనివ్వాలి.
-ఇప్పుడు మూత తీసి చూడండి. మంచిగా రెండువైపులా కాలిన తర్వాత దించేసి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి.
-ఇప్పుడు దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని నచ్చిన చట్నీతో లేదా సాస్ తో తింటే నోటికి స్వర్గమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications