బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్‌ అనిపించే టేస్ట్‌.!

విటమిన్‌ సి పుష్కలంగా లభించే బ్రోకలీని ఆహారంలో తరచూ భాగం చేసుకుంటాం. అయితే ఎక్కువగా దీనిని సలాడ్‌ రూపంలోనే తీసుకుంటాం. స్వల్వంగా ఉడికించి క్యారెట్‌, కీరదోసతో స్నాక్స్‌ మాదిరిగా తీసుకుంటాం. అయితే ఈ బ్రోకలీతో రుచికరమైన, హెల్తీ కర్రీ కూడా చేసుకోవచ్చని తెలుసా. ఒక్కసారి ఈ పద్ధతిలో చేశారంటే లొట్టలేసుకుంటూ తినేస్తారు. బ్రోకలీ ఆలూ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Healthy broccoli potato curry recipe delicious indian style with easy process

బ్రోకలీ ఆలూ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

బంగాళాదుంప ముక్కలు- ఒక కప్పు
బ్రోకలీ ముక్కలు- ఒకటిన్నర కప్పు
బాదం పలుకులు- పదిహేను
పచ్చి కొబ్బరి ముక్కలు- పావు కప్పు
జీలకర్ర- పావు టీస్పూన్‌
కరివేపాకు- రెండు రెబ్బలు
వెల్లుల్లి రెబ్బలు- పది
నూనె- నాలుగు టేబుల్‌ స్పూన్లు
ఆవాలు- అర టీస్పూన్‌
పచ్చి శనగపప్పు- అర టేబుల్‌ స్పూన్‌
జీలకర్ర- పావు టీస్పూన్‌
ఉల్లిపాయ- ఒకటి
అల్లం తురుము- అర టేబుల్‌ స్పూన్‌
పచ్చిమిర్చి- మూడు
పసుపు- పావు టీస్పూన్‌
కారం- అర టీ స్పూన్‌
నీళ్లు- ఒకటి పావు కప్పు
కొత్తిమీర తురుము- గుప్పెడు

బ్రోకలీ ఆలూ కర్రీ తయారీ విధానం

ముందుగా కట్‌ చేసిన బ్రోకలీ, బంగాళాదుంప ముక్కలను కొన్ని నీళ్లలో వేసి 80శాతం వరకు ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్‌ తీసుకుని అందులో బాదం పలుకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసి దోరగా వేగనివ్వాలి. అల్లం తురుము, చిన్నగా కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి.

Healthy broccoli potato curry recipe delicious indian style with easy process

తర్వాత ఉడికించిన బంగాళాదుంప, బ్రోకలీ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత కారం, పసుపు వేసి మగ్గించుకోవాలి.

ఇప్పుడు గ్రైండ్‌ చేసుకున్న పేస్ట్‌ వేసి కలిపి మూత పెట్టి చిన్న మంటపైన ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నీళ్లు పోసి మూత పెట్టి నూనె పైకి తేలేవరకు ఉడకనివ్వాలి.

నూనె పైకి తేలి కూర మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. హెల్తీ అండ్‌ టేస్టీ బ్రోకలీ, ఆలూ కర్రీ రెడీ. అన్నం, చపాతీలో, నాన్‌లోకి ఈ కాంబినేషన్‌ ఎవర్‌గ్రీన్‌ రుచితో అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Saturday, October 3, 2026, 15:25 [IST]
Desktop Bottom Promotion