Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
ఇడ్లీ,దోశల్లోకి బెస్ట్ కాంబినేషన్ కరివేపాకు కొబ్బరి చట్నీ..మామూలు చట్నీల కంటే 100 రెట్లు రుచి!
మన ఇళ్లలో ఇడ్లీ, దోసెలు సర్వసాధారణం. వీటికి పల్లి చట్నీ లేదా మామూలు కొబ్బరి చట్నీ చేసి చేసి మీకు బోర్ కొట్టిందా? అయితే మీ ఇంట్లో కరివేపాకు ఎక్కువగా ఉందా? అయితే ఆ కరివేపాకు, కొబ్బరి కలిపి ఒక అద్భుతమైన చట్నీ తయారు చేసి చూడండి. మామూలు చట్నీల కంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి ఇడ్లీలలో ఈ చట్నీ వేసుకుని తింటే ఇంట్లో వాళ్లు రోజూ తినేదాని కంటే మరో రెండు ఇడ్లీలు, దోసెలు లాగించేయడం ఖాయం. రుచితో పాటు కరివేపాకులో ఉండే ఐరన్, విటమిన్స్ మన జుట్టు రాలకుండా కాపాడతాయి, చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి.

కరివేపాకు కొబ్బరి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 3
అల్లం - 1 అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు - 2
తాజా కరివేపాకు - అర కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 1 కప్పు
చింతపండు - చిన్న ఉసిరికాయంత
వేయించిన పల్లీలు- 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టేబుల్ స్పూన్
మినప పప్పు - అర టేబుల్ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కరివేపాకు కొబ్బరి చట్నీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. నూనె కాస్త వేడెక్కాక అందులో 3 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి కలుపుతూ వేయించండి. వెల్లుల్లి కాస్త బంగారు గోధుమ రంగులోకి మారాక మంచి సువాసన వస్తుంది.
-ఇప్పుడు ఇందులో మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అర కప్పు కరివేపాకును వేసి వేయించడం కొనసాగించండి. కరివేపాకు పచ్చివాసన పోయి, బాగా కరకరలాడేంత వరకు (క్రిస్పీగా అయ్యేవరకు) సన్నని మంట మీద వేయించి స్టవ్ కట్టేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. అందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు, రెండు టేబుల్ స్పూన్ల పొట్టు తీసిన వేయించిన పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు వేయండి. దీనికి సుమారు అరకప్పు నీళ్లు పోసి మరీ గట్టిగా కాకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకోండి.
-చట్నీకి తాలింపు కోసం ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయండి. అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి. తర్వాత మినపపప్పు వేసి ఎర్రగా వేయించండి. చివరగా కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆపేయండి. ఈ తాలింపుని తయారు చేసి పెట్టుకున్న చట్నీపై వేసి బాగా కలుపుకోండి.
-అంతే ఎంతో కమ్మని, ఆరోగ్యకరమైన కరివేపాకు కొబ్బరి చట్నీ నిమిషాల్లో రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
