Latest Updates
-
బెంగళూరు వీధుల్లో దొరికే అచ్చమైన మష్రూమ్ దొన్నె బిర్యానీ..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
తొలిసారి విదేశీ ప్రయాణమా.. ఈ 5 తప్పులు చేస్తే మీ వీసా తిరస్కరణకు గురైనట్లే.! -
మొఘలాయ్ తవా చికెన్.. మసాలా వేశాక ఇలా చేస్తే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం!
ఆఫీసుకైనా, స్కూల్‌కైనా హెల్తీ లంచ్ బాక్స్.. కాజు మునక్కాడ కర్రీ ఇలా చేశారంటే రుచి అదుర్స్.!
మునక్కాడలతో సాంబారు, పప్పు, టమాటా కూర, సూప్ ఇలా పలు రకాల వెరైటీలు ట్రై చేసి ఉంటారు. అయితే వీటికి తోడుగా జీడిపప్పులను వేసి చేయడం ద్వారా పోషక గుణాలు ఇంకా పెరుగుతాయి. అంతేకాకుండా ఆఫీసులకి వెళ్లేవారికి, పిల్లల లంచ్‌బాక్స్‌లోకి రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది.

వర్షాకాలంలో సీజనల్ వ్యాధులను తట్టుకునేందుకు రోగనిరోధక శక్తి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో తరచుగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుండటంతో రోగాల బారిన పడుతుంటారు. అందుకే వారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా సమతుల్య ఆహారం ఇవ్వడం అవసరం. ఈకాలంలో రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు ఆయుర్వేద గుణాలు కలిగిన మునక్కాడలు దోహదపడతాయి. వాటికి కొన్ని జీడిపప్పులు జోడించి వంటచేసినట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు రుచికి రుచి అదిరిపోతుంది. మునక్కాడల జీడిపప్పు కర్రీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..
మునక్కాడల జీడిపప్పు కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలు
మునక్కాడలు- 12 ముక్కలు
జీడిపప్పు- ముప్పావు కప్పు
జీడిపప్పు పేస్ట్ కోసం- రెండు టేబుల్
స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు తరిగినవి- అర కప్పు
టమాటా ముక్కలు- ఒకటిన్నర కప్పు
కసూరి మేతి- టేబుల్ స్పూన్
ధనియాల పొడి- టేబుల్ స్పూన్
కారం- టీస్పూన్
పసుపు- పావు టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
నీళ్లు- ఒకటి పావు కప్పు
జీలకర్ర- అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టేబుల్
స్పూన్
నూనె- టేబుల్ స్పూన్
మునక్కాడల జీడిపప్పు కర్రీ తయారీ విధానం
ముందుగా పాన్ స్టవ్‌పైన పెట్టి వేడయ్యాక నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక జీడిపప్పు ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో జీలకర్ర వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. కాసేపటి తర్వాత మునక్కాడ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
ఇప్పుడు అందులో పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు ఉడికించాలి. తర్వాత ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి వేసి కలపాలి. అందులో తరిగిన టమాటా ముక్కలు వేయాలి. టమాటా గుజ్జుగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి.
జీడిపప్పు పేస్ట్ కూరలో మొత్తం కలిశాక నీళ్లు పోసి నూనె పైకి తేలేవరకు ఉడికించాలి. మధ్యలో ధనియాల పొడి, కొత్తిమీర, కసూరి మేతి వేసి కలుపుకోవాలి. చివరిగా వేయించిన జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కూర ఉడికి నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన మునక్కాడ జీడిపప్పు కర్రీ రెడీ. వేడివేడి అన్నంలోకి తినడమే కాకుండా లంచ్ బాక్స్‌లోకి సైతం పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.
గర్భిణీలకు బెస్ట్ ఫుడ్
మునక్కాయల్లో విటమిన్ 'సి', యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఈ సీజన్లో వచ్చే దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. కాల్షియం, ఐరన్ ఎముకలను దృఢంగా మార్చుతుంది. డయాబెటిస్ రోగులకు షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. పురుషుల్లో లైంగిక శక్తిని బలోపేతం చేస్తుంది. నరాలకు పటుత్వాన్ని ఇవ్వడమే కాకుండా గుండె, కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇందులోని డైటరీ ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది. వీటిలోని ఫోలిక్ యాసిడ్ గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు మేలు చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
