Latest Updates
-
వేళ్లు కూడా నాకి నాకి తినే కొత్తిమీర పన్నీర్ కర్రీ..రోటీ, నాన్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
సండే స్పెషల్: పుల్లపుల్లగా, కారంకారంగా మామిడికాయ మటన్ కర్రీ.. టేస్ట్ కిర్రాక్! -
ఎండలు మండిపోతున్నాయా? వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు ఇవే! -
మోహినీ ఏకాదశి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? వ్రత ఫలితం దక్కాలంటే పారణ సమయాలు, నియమాలు తప్పక తెలుసుకోండి! -
ఏప్రిల్ 26న గ్రహాల మార్పు: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్తలు తప్పవా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉందో చూడండి! - 26 ఏప్రిల్ నుండి 02 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు రాశుల వారికి రాజయోగం.. ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! - ఆదివారం, 26 ఏప్రిల్ 2026 -
కరకరలాడే మొక్కజొన్న పకోడీ'.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
ఎండల తీవ్రతతో గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందేనా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ బ్రేక్ ఫాస్ట్ కి గుడ్ బై.. నోటికి కమ్మగా, ఒంటికి బలంగా పనీర్ పెసర దోశ..ఎలా చేసుకోవాలంటే..
రాయలసీమ స్పెషల్ రెసిపి..1000 ఏనుగుల బలం వస్తుంది,ఎలా చేసుకోవాలంటే
రాయలసీమ అంటే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది పదం పౌరుషం. రాయలసీమ వాళ్ల ఆ పౌరుషం గొడ్డుకారం నుంచే వస్తుందని చెబుతుంటారు. గొడ్డుకారం రాయలసీమ వంటకాలలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. రాయలసీమకు చెందిన ప్రజలు ఈ గొడ్డు కారం తినేందుకు బాగా ఇష్టపడతారు. అందుకే అక్కడ ప్రతి ఒక్కరి ఇంట్లో ఏది ఉన్నా లేకున్నా గొడ్డు కారం మాత్రం తప్పక ఉంటుంది. ఈ కారం అన్నంలోకి, దోసెల్లోకి, ఇడ్లీలోకి,ఇతర టిఫిన్లలోకి చాలా బాగుంటుంది.
గొడ్డు కారం తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని డాక్టర్లు కూడా చెబుతుంటారు. అలాంటి గొడ్డుకారాన్ని రాయలసీమ స్టైల్ లో ఎలా చేసుకోవాలి,దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.
గొడ్డు కారం తయారీకి కావాల్సిన పదార్థాలు
-ఎండుమిరపకాయలు-25
-ఉల్లిపాయలు- 2
-వెల్లుల్లి-12 రెబ్బలు
-చింతపండు- నిమ్మపండు సైజు అంత
-జీలకర్ర-1 టీస్పూన్
-ఆవాలు- 1/2 టీస్పూన్
-నూనె- 2 టేబుల్ స్పూన్లు
-ఉప్ప
-కరివేపాకు
గొడ్డు కారం తయారీ విధానం
-ముందుగా ఎండుమిర్చిని శుభ్రంగా కడిగి, వాటిని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి.
-ఉల్లిపాయలను కూడా చిన్నగా తరుగుకోవాలి.
-వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి వాటిని కూడా చిన్నగా తరుగుకోవాలి.
-చింతపండును కొద్దిగా నీటిలో నానబెట్టాలి.
-ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
-నానబెట్టిన చింతపండును పిండి, దాని రసాన్ని కూడా మిశ్రమంలో కలపాలి.
-స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో ఆయిల్ పోసి వేడి చేయాలి.
-నూనె వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి వేయించాలి.
-కరివేపాకు వేగిన తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్లో వేసి బాగా కలపాలి.
-మిశ్రమాన్ని మీడియం మంట మీద 5-10 నిమిషాలు వేయించాలి.
-కారం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దానిని చల్లారనివ్వాలి. అంతే గొడ్డు కారం రెడీ. ఫ్రిజ్లో 1-2 వారాల వరకు ఈ కారాన్ని నిల్వ చేసుకోవచ్చు.
-మీరు కారంను మరింత రుచిగా చేయాలనుకుంటే, కొద్దిగా బెల్లం కూడా వేసుకోవచ్చు.
-చల్లారిన తర్వాత కారాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications





