Latest Updates
-
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
ఉలవలు అనగానే ఎవరికైనా చిన్నప్పుడు అమ్మ కట్టెల పొయ్యిపైన గంటల పాటు ఉడికించి తర్వాత ఉడికిన వాటితో గుగ్గిళ్లు చేయడం, మరిగిన నీళ్లతో చారు చేయడం గుర్తొస్తుంది. ఆ రుచి ముందు నాన్‌వెజ్ కూడా దిగదుడుపే అంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇప్పుడు అంత ఓపిక, అలాంటి వంటకాలు తగ్గిపోయాయి. ఉలవలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కండబలానికి దోహదపడుతుంది. అలాంటి ఉలవలను పక్కన పెట్టేయకుండా ఇలా హెల్తీగా దోశలు చేసుకుని కూడా శరీరానికి పోషకాలను అందించవచ్చు. ఉలవల దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం..

ఉలవల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
బియ్యం- కప్పు
ఉలవలు- అర కప్పు
మినప్పప్పు- పావు కప్పు
మెంతులు- టీస్పూన్
మందంగా ఉండే అటుకులు- పావు కప్పు
ఉప్పు- టీస్పూన్
ఉలవల దోశ తయారీ విధానం
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్!
ముందుగా ఒక వెడల్పాటి బౌల్‌లో బియ్యం, ఉలవలు, మినప్పప్పు, మెంతులు వేసి కలిపి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి. అటుకులను అరగంట పాటు నానబెట్టుకోవాలి.
నాలుగు గంటల తర్వాత నీళ్లు తీసేసి మరోసారి కడిగి మిక్సీ జార్‌లో అటుకులు, ఉలవల మిశ్రమం వేసుకుని దోశ పిండి మాదిరిగా రుబ్బుకోవాలి.

టీస్పూన్ ఉప్పు వేసి కలిసి 8 గంటల పాటు మూత పెట్టి ఉంచాలి. దీంతో పిండి బాగా పులుస్తుంది. ఈ పిండిని ఒకసారి కలిపి అవసరమైతే కొన్ని నీళ్లు పోసుకోవచ్చు.
ఇప్పుడు స్టవ్‌పైన పెనం పెట్టుకుని కొద్దిగా నూనె అప్లై చేసి పెనం వెడల్పుగా రుద్ది గరిటెతో దోశలు పోసుకోవడమే. ఈ దోశలను రెండు వైపులా కాల్చుకుంటే చాలా క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి.
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే!
ఉలవల దోశలను పల్లీ చట్నీ లేదా టమాటా చట్నీతో తింటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు దోశలు, ఇడ్లీలు మానేసే పని లేకుండా ఈ ఉలవల దోశలను ట్రై చేయొచ్చు.
ఉలవల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలానికి, ఎనర్జీకి దోహదపడుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. పొట్ట తేలికగా ఉండేలా చేస్తుంది. ఉలవలతో గుగ్గిళ్లు, చారు లాంటి టైం టేకింగ్ రెసిపీస్ చేసే ఓపిక లేని వారు ఇలా హెల్తీగా దోశలు చేసుకుని తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
