Latest Updates
-
రాజయోగం, ధన యోగం కలయిక.. ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మైసూర్ మటన్ పులావ్..టేస్ట్ కి సలాం కొట్టాల్సిందే!..ఈజీగా చేసుకోండిలా.. -
ఈరోజు సోమవారం.. పనులు మొదలుపెట్టే ముందు ఈ రాహుకాలం, శుభ ముహూర్తాలు చూసుకున్నారా? -
రేవతి నక్షత్రంలోకి శని ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు.. జీవితంలో ఊహించని మార్పులు! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 18 మే 2026 -
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి!
కడుపుకు తేలికగా, నోటికి రుచిగా ఉండే కమ్మనిపెరుగు ఉప్మా.. బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్ ఆప్షన్!
రోజూ ఇంట్లో చేసుకునే రొటీన్ ఉప్మాతో బోర్ కొట్టిందా? ఉప్మా పేరు వినగానే పిల్లలు ముఖం మాడ్చుకుంటున్నారా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఎంతో కమ్మగా ఉండే పెరుగు ఉప్మా(Dahi Upma) ట్రై చేయండి. ఉదయం పూట బ్రేక్ ఫాస్ ట్గాకానీ, రాత్రి సమయంలో తేలికపాటి డిన్నర్గాకానీ ఇది అద్భుతంగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేంత మృదువుగా.. పెరుగులోని కమ్మదనం, పోపులోని కరకరలాడే రుచితో ఇది మీ కుటుంబ సభ్యులందరినీ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. పైగా పెరుగు వాడటం వల్ల కడుపుకు చాలా తేలికగా ఉండి త్వరగా జీర్ణమవుతుంది. టేస్టీ పెరుగు ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏమిటో ఇక్కడ చూడండి.
పెరుగు ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు
వేయించిన బొంబాయి రవ్వ (సూజీ) - 1 కప్పు
కమ్మటి పెరుగు - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
టమాటా - 1
అల్లం తరుగు - 1 టీస్పూన్
కొత్తిమీర - గుప్పెడు
ఉప్పు - రుచికి సరిపడా
వంటనూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టీస్పూన్
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్
మినపప్పు - 1 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి - 1
పచ్చిమిర్చి - 1 లేదా 2
కరివేపాకు - కొన్ని రెమ్మలు
ఉల్లిపాయ - 1
పచ్చి బఠానీ - అర కప్పు
పసుపు - చిటికెడు
అలంకరణకు: వేయించిన పల్లీలు, జీడిపప్పు
నెయ్యి - కొద్దిగా
పెరుగు ఉప్మా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీళ్లు పోసి ఎక్కడా ఉండలు లేకుండా మజ్జిగలా బాగా గిలకొట్టాలి. ఇందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు, అల్లం తరుగు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
-స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు వేగి కమ్మటి వాసన వస్తుండగా... ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు పారదర్శకంగా మారాక, పచ్చి బఠానీలు వేసి అవి కాస్త మెత్తబడే వరకు ఉడికించాలి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను కడాయిలో వేసి, పోపుతో బాగా కలిసేలా ఒక నిమిషం పాటు సన్నని మంట మీద వేయించాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు మంటను పూర్తిగా సిమ్ లో పెట్టి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పెరుగు-నీళ్ల మిశ్రమాన్ని కడాయిలో నెమ్మదిగా పోస్తూ, రవ్వ ఉండలు కట్టకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి. మూతపెట్టి సన్నని మంట మీద రవ్వ ఆ ద్రవాన్నంతా పీల్చుకునే వరకు ఉడకనివ్వాలి. అడుగు అంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.
-ఉప్మా క్రీమీగా, సాఫ్ట్ గా దగ్గరపడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-చివరగా పైనుంచి కొద్దిగా నెయ్యి, ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు చల్లితే.. ఎంతో రుచికరమైన, నోరూరించే పెరుగు ఉప్మా రెడీ.
-వేడివేడిగా ఈ ఉప్మాను ప్లేట్ లోకి తీసుకుని, దానికి జోడీగా కాస్త ఆవకాయ పచ్చడి కానీ, పల్లీ చట్నీ కానీ నంజుకుని తింటే ఆ రుచి అద్భుతం.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












