Latest Updates
-
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.! -
పంద్రాగ్రస్ట్ స్పెషల్.. బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పాత్రలో చాలా ఈజీగా తిరంగా కేక్.! -
ప్రాణాల మీదకు తెచ్చిన మొబైల్ పిచ్చి.. షకీలాకు మెడ సర్జరీ, కారణం తెలిస్తే షాక్! -
80వ స్వాతంత్ర్య దినోత్సవం.. వాట్సప్ స్టేటస్, కోట్స్.. మన భారతీయులకు ఇలా విషెస్ తెలియజేయండి! -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన ఆవ నూనె తయారీ.. మిక్సీ ఉంటే చాలు! -
ఆగస్టు 15 స్పెషల్..పక్కా స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డూ.. మీ ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేయండి -
రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా.. మీ ఫ్యామిలీలో ఈ సమస్యలు రావడం పక్కా.! -
మన ఇంట్లో పెరిగే ఈ చెట్టు పండ్లే కాదు.. ఆకులు సైతం రోగాలతో పోరాడతాయని తెలుసా.!
ప్రోటీన్ పవర్ హౌస్..జస్ట్ 2 నిమిషాల్లో బీహారీ స్టైల్ చనా చాట్..బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్!
వేసవి కాలంలో వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, పొయ్యి దగ్గర గంటల తరబడి నిలబడి వంట చేయాలంటే ఎవరికైనా విసుగుగానే ఉంటుంది. ఆ సమయంలో కడుపుకు తేలికగా ఉంటూనే, నాలుకకు రుచిగా, కారంగా, ఆరోగ్యకరంగా ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే.. బీహారీ స్టైల్ స్పైసీ చనా చాట్ మీకు పర్ఫెక్ట్ ఛాయిస్.
కేవలం రెండు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే తయారయ్యే ఈ అద్భుతమైన చాట్.. పులుపు, కారంల కలయికతో నోరూరిస్తూ అన్ని వయసుల వారినీ ఆకట్టుకుంటుంది. శనగలలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల డైట్ చేసేవారికి ఇది బెస్ట్ స్నాక్ ఆప్షన్. ఈ ప్రోటీన్ రిచ్ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బీహారీ స్టైల్ చనా చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-శనగలు
-ఉల్లిపాయ
-పచ్చిమిర్చి
-టమాటో
-జీలకర్ర పొడి
-ఉప్పు
-కారం
-చాట్ మసాలా
-కొత్తిమీర
-పుదీనా
-నిమ్మరసం
బీహారీ స్టైల్ చనా చాట్ తయారీ విధానం
-ముందుగా సుమారు ఒక కప్పు తెల్ల లేదా నల్ల శనగలను ఉడికించాలి. శనగలు మెత్తగా ఉడకాలి కానీ, పూర్తిగా చిదిమిపోయేలా ముద్దగా మారకూడదు.
-ఈ బీహారీ చనా చాట్ కు ప్రాణం ఇందులోని మసాలాలే. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో ఉడికించి పెట్టుకున్న శనగలను వేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపండి. ఉప్పు, కారం, చాట్ మసాలా, వేయించిన జీలకర్ర పొడి వేసి అన్నింటినీ నెమ్మదిగా పైకి కిందికి కలుపుకోవాలి. మసాలాలు శనగలకు పూర్తిగా పట్టేలా ఓ అర నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి.
-ఇప్పుడు అందులో తాజా నిమ్మకాయ రసాన్ని పిండండి. ఈ నిమ్మకాయ పులుపు మసాలాల ఘాటును బ్యాలెన్స్ చేసి చాట్ కు ఒక సరికొత్త, అద్భుతమైన రుచిని అందిస్తుంది.
-చివరగా, చాట్ చూడగానే ఆకట్టుకునేలా సన్నగా తరిగిన కొత్తిమీర లేదా పుదీనా ఆకులను పైన చల్లుకోండి. పిల్లలకు మరింత కరకరలాడే రుచి కావాలనుకుంటే కాస్త సన్న కారప్పూస కూడా కలుపుకోవచ్చు.
-అంతే ఎంతో కమ్మటి, కారపు, ఆరోగ్యకరమైన బీహారీ స్టైల్ స్పైసీ చనా చాట్ రెడీ. సాయంత్రం వేళ టీతో పాటు లేదా ఆఫీస్ నుండి రాగానే అలసట తీర్చే స్నాక్ గా దీనిని ఎప్పుడైనా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications