Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
ప్రోటీన్లు, విటమిన్ల గని.. బరువు తగ్గించే పర్ఫెక్ట్ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇదే!
ఉదయం పూట మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా మనల్ని ఎంత ఉల్లాసంగా ఉంచుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉదయం తినే ఆహారం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించేదిగా ఉండాలి. రోజూ తినే ఇడ్లీ, దోశలతో బోర్ కొట్టి కొత్తగా, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు క్వినోవా వెజిటబుల్ ఖిచిడి బెస్ట్ ఆప్షన్.

క్వినోవా వెజిటబుల్ ఖిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు
క్వినోవా - 1 కప్పు
నీళ్లు - 2 కప్పులు
ఉల్లిపాయ - 1 చిన్నది
క్యారెట్ - 1
పచ్చి బఠానీలు - పావు కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు
టమోటా - 1
పచ్చిమిర్చి - 1
జీలకర్ర - అర టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
అల్లం తురుము - అర టీస్పూన్
నెయ్యి లేదా నూనె - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
క్వినోవా వెజిటబుల్ ఖిచిడి తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో క్వినోవాను తీసుకుని, రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల క్వినోవాలో ఉండే సహజమైన చేదుదనం పూర్తిగా పోతుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ లో నెయ్యి లేదా నూనె వేడి చేయాలి. నెయ్యి వాడితే ఖిచ్డీ రుచి అద్భుతంగా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి.
-ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, లేత బంగారు రంగులోకి మారే వరకు వేయించాలి. ఆ తర్వాత క్యారెట్, పచ్చి బఠానీలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు లేదా మూడు నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి.
-ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కూరగాయలు కొద్దిగా మెత్తబడే వరకు ఉడికించాలి.
-కూరగాయలు మగ్గిన తర్వాత, ముందుగా కడిగి పెట్టుకున్న క్వినోవాను కుక్కర్ లో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి, మూత పెట్టి మీడియం మంట మీద రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. సాధారణ గిన్నెలో వండుతున్నట్లయితే 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి.
-రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్లోని ఆవిరి పోయేదాకా 5 నిమిషాలు ఆగి మూత తీయాలి.
-అంతే ఘుమఘుమలాడే, ఎంతో రుచికరమైన క్వినోవా వెజిటబుల్ ఖిచిడి రెడీ. వేడి వేడిగా ఉన్న ఈ ఖిచిడిపై సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి, ఇష్టమైన పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి.

క్వినోవా ఖిచిడి ఎందుకు తినాలి?
క్వినోవాలో ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. దీనిని రంగురంగుల కూరగాయలతో
కలిపి వండటం వల్ల ఇది ఒక సంపూర్ణ పోషకాహారంగా మారుతుంది. ఉదయం పూట ఈ
ఖిచిడిని తినడం వల్ల ఎక్కువ సేపు పొట్ట నిండిన భావన కలుగుతుంది.
కాబట్టి పదే పదే ఆకలి వేయదు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్
ఆప్షన్. రోజంతా ఉత్సాహంగా పనిచేయడానికి అవసరమైన శక్తిని ఇది
అందిస్తుంది. ఇందులో ఫైబర్, ఐరన్, ఎన్నో రకాల విటమిన్లు, యాంటీ
ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
