Latest Updates
-
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.!
ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండే సోయా సలాడ్..తింటే ఎముకలు ఉక్కులా, కండరాల పుష్ఠి!
డైట్ అనగానే ఉప్పు, కారం లేని చప్పటి ఆహారం తినాలి అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ ఆరోగ్యకరమైన ఆహారం కూడా అద్భుతమైన రుచితో ఉంటుందని నిరూపించే అద్భుతమైన రెసిపీనే హై ప్రోటీన్ సోయా చంక్ సలాడ్.
బరువు తగ్గాలనుకునే వారికి, కండరాలు పెంచుకోవాలనుకునే వారికి, లేదా రోజూ జిమ్ చేసేవారికి పోస్ట్ వర్కవుట్ మీల్ గా ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. ఇందులో సోయాలోని ప్రోటీన్, మఖానాలోని కరకరలాడే స్వభావం, కూరగాయల తాజాదనం అన్నీ కలిసి మీ నాలుకకు రుచిని, శరీరానికి శక్తిని ఇస్తాయి.

సోయా చంక్ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు
డ్రై సోయా చంక్స్ - 50 నుండి 60 గ్రాములు
కీరదోసకాయ - 1
ఉల్లిపాయ - 1
టమాటా - 1
లెట్యూస్ ఆకులు- 1 కప్పు (తరిగినవి)
నిమ్మరసం - సగం చెక్క
ఉప్పు - రుచికి తగినంత
సోయా మసాలా కోసం:
నూనె - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
క్రీమీ డ్రెస్సింగ్ కోసం
గట్టి పెరుగు - అర కప్పు
వేయించిన మఖానా - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 1 (సన్నగా తరిగినది)
వెల్లుల్లి రెబ్బ - 1 (తురుముకోవాలి)
మిరియాల పొడి - చిటికెడు
చిల్లీ ఫ్లేక్స్ - కొద్దిగా
ఉప్పు - రుచికి తగినంత
అచ్చమైన ఆంధ్ర స్టైల్ కొబ్బరి కారం.. ఒక్క స్పూన్ నెయ్యి పడితే ప్లేటన్నం ఖాళీ అవ్వాల్సిందే!
సోయా చంక్ సలాడ్ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని కొద్దిగా ఉప్పు వేసి మరిగించండి. అందులో సోయా చంక్స్ వేసి 8 నుండి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఆ తర్వాత నీటిని వడకట్టి, సోయా చంక్స్ చల్లారాక వాటిలోని అదనపు నీరు మొత్తం పోయేలా గట్టిగా పిండుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఒక టీస్పూన్ నూనె వేడి చేయాలి. మంటను సిమ్ లో ఉంచి అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మాడిపోకుండా కొన్ని సెకన్ల పాటు వేయించాలి. ఈ మసాలాలో ఉడికించి పిండుకున్న సోయా చంక్స్ వేసి, మసాలా అంతా ముక్కలకు పట్టేలా, కాస్త క్రిస్పీగా మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో చిన్నగా తరిగిన కీరదోసకాయ, ఉల్లిపాయ, టమాటా, లెట్యూస్ ఆకులు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఫ్రెష్ వెజిటేబుల్ మిక్స్ పైన వేయించి పెట్టుకున్న కారం కారంగా ఉండే సోయా చంక్స్ ను వేయాలి.
-ఒక చిన్న గిన్నెలో పెరుగు తీసుకుని, అందులో క్రష్ చేసిన వేయించిన మఖానా, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, తురిమిన వెల్లుల్లి, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు వేసి క్రీమీగా అయ్యేలా కలుపుకోవాలి.
-చివరగా, ఈ క్రీమీ డ్రెస్సింగ్ ను సలాడ్ పైన పోసి, అన్నీ కలిసేలా బాగా కలుపుకుంటే.. ఎంతో రుచికరమైన, నోరూరించే సలాడ్ తినడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
