Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్‌లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.!
అల్లం పచ్చడి మన తెలుగు వంటకాల్లో ఎంతో ఫేమస్. ముఖ్యంగా హోటల్స్‌లో టిఫిన్లలో ఈ పచ్చడి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఈ పచ్చడితో ఒక్క బైట్ తిన్నా చాలు ఆ స్పైసీనెస్‌కి నాలుక మండినా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే ఈ అల్లం పచ్చడి ఎక్కువగా ఎర్ర కారం లేదా ఎండు మిర్చితో ఎక్కువగా చేస్తారు. కానీ ఈ సారి పచ్చిమిర్చితో ట్రై చేసి చూడండి. ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో పాటు టిఫిన్, రైస్‌లోకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.

అల్లం నిల్వ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చిమిర్చి- పావు కేజీ
చింతపండు- నిమ్మకాయ సైజు(50 గ్రాములు)
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు
అల్లం- 60 గ్రాములు
ఉప్పు- రుచికి సరిపడా
ఆవాలు- అర టీస్పూన్
జీలకర్ర- అర టీస్పూన్
ఎండు మిర్చి- రెండు
ఇంగువ- కొద్దిగా
కరివేపాకు- రెండు రెబ్బలు
అల్లం నిల్వ పచ్చడి తయారీ విధానం
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.!
ముందుగా అల్లంను పొట్టు తీసి శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తొడిమలు తీసి కడగాలి. వీటిని మూడు భాగాలుగా కట్ చేసుకోవాలి. చింతపండును కడిగి పెట్టుకోవాలి.
స్టవ్‌పైన పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే నూనెలో అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి.

ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు, రుచికి సరిపడా రాతి ఉప్పు వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌లో మిగిలిన నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి కలపాలి.
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!
చిన్న మంటపైన పెట్టి అడుగంటకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఉప్పు సరిచూసుకోవాలి. నూనె పైకి తేలుతూ పచ్చడి మొత్తం సెపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
టేస్టీ అండ్ హెల్తీ అల్లం నిల్వ పచ్చడి రెడీ. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, బోండా లాంటి బ్రేక్‌ఫాస్ట్‌ల్లోకి అదిరిపోతుంది. ఇంకా లంచ్‌లో వేడివేడి అన్నంలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. రానున్న చలికాలంలో శరీరంలో వేడి పెంచుకునేందుకు, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఈ పచ్చికారం అల్లం పచ్చడిని తప్పకుండా ట్రై చేయాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
