Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
వెల్లుల్లి పులుసు తింటే సర్వ రోగాలు మటుమాయం,సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసా?
ఇప్పుడైతే అన్నంలో కూడా టమాటో సాస్ వేసుకొని తినేస్తున్నారు. దీంతోపాటు రకరకాల ఫ్యాన్సీ, ఫ్యాన్సీ వంటలు చేసుకొని తింటున్నారు. దీని కారణంగా అనారోగ్యం పాలవడంతో పాటు శరీరానికి ఎలాంటి పోషకాలు అందడం లేదు. కానీ మన పూర్వికులు చాలా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తీసుకునే వారు. అందులో ఒకటే వెల్లుల్లి పులుసు. దీనిని చింతపండు పులుసు మాదిరిగానే చేసుకుంటారు. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వెల్లుల్లి పులుసును ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో వివరించాము. పూర్తిగా చదివి మీరు కూడా ట్రై చేయండి.
వెల్లుల్లి పులుసు తయారీకి కావలసిన పదార్థాలు:
చింతపండు - 50 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 10-15
ఉల్లిపాయ - 1 (చిన్నది)
పచ్చిమిర్చి - 2-3 (మీ రుచికి తగినట్లు)
కరివేపాకు - 2 రెబ్బలు
ఆవాలు - 1/2 టీస్పూన్
మెంతులు - 1/4 టీస్పూన్
ఇంగువ - చిటికెడు
పసుపు - 1/2 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్ (మీ రుచికి తగినట్లు)
ధనియాల పొడి - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - వేయించడానికి సరిపడా

వెల్లుల్లి పులుసు తయారీ విధానం:
- ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టి, గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి, ఆవాలు, మెంతులు మరియు ఇంగువ వేయాలి వేసుకొని వేయించుకోవాలి.
- తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
- ఆ తరువాత ఆ మిశ్రమంలో వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
- ఇప్పుడు చింతపండు పులుసు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి మరియు ఉప్పు వేసి బాగా కలపాలి. అనంతరం పులుసును కాసేపు ఉడకనివ్వాలి, అది చిక్కబడే వరకు అలానే ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర తరుగు వేసి దించుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే, మన పూర్వీకుల స్టైల్లో వెల్లుల్లి పులుసు సిద్ధమైనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
