Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
పుష్కలంగా ఫైబర్, ప్రొటీన్.. బరువు తగ్గేందుకు హెల్తీ అండు కొర్రల పాలక్ రైస్
బరువు తగ్గాలనుకునేవారు ఇటీవలి కాలంలో తమ డైట్లో మిల్లెట్లను ఎక్కువగా చేర్చుకుంటున్నారు. మిల్లెట్లలో అండు కొర్రలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. హెల్తీగా బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉండే పాలకూరను కలిపి తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. వెయిట్‌లాస్ కోసం ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే అండుకొర్రల పాలక్ రైస్ మంచి ఛాయిస్.

బరువు తగ్గడం కోసం చాలా మంది కార్బొహైడ్రేట్లు తక్కువగా తీసుకుంటూ ప్రొటీన్‌కు తమ ఆహారంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో మిల్లెట్లకు మార్కెట్లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గేందుకు కొర్రలు, అరికెలు, సామలు ఇలా తమ డైట్లో ఉండేలా చూసుకుంటున్నారు. అన్నంలా వండుకోవడం, కిచిడీ, ఉప్మా ఇలా రకరకాలుగా తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు అండుకొర్రల పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
అండుకొర్రల పాలక్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు
అండుకొర్రలు- 100 గ్రాములు(ఒక కప్పు)
నీళ్లు- 3 కప్పులు
పాలకూర కట్టలు- 4
సోయా చంక్స్- ఒక కప్పు
ఉల్లిపాయ- మీడియం సైజు ఒకటి
పచ్చిమిర్చి- 3
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్
జీలకర్ర, ఆవాలు- అర టీ స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా
కారం- అర టీస్పూన్
పసుపు- కొద్దిగా
కరివేపాకు, కొత్తిమీర- తగినంత
నువ్వుల నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
నిమ్మకాయ- ఒకటి
అండుకొర్రల పాలక్ రైస్ తయారీ విధానం
ముందుగా అండుకొర్రలను ముందు రోజు రాత్రి అంటే కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. సోయా చంక్స్‌ను వేడినీళ్లలో పది నిమిషాల పాటు నాననివ్వాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
ఇప్పుడు కుక్కర్లో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు సోయాచంక్స్, పసుపు, కారం వేసి కొద్ది సేపు ఉడకనివ్వాలి. తర్వాత పాలకూర, కరివేపాకు వేసి నీళ్లు ఆవిరి అయ్యేవరకు కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసి కలిపాక అండుకొర్రలను వేసి ఒకసారి కలియతిప్పాలి.
చివరిగా నీళ్లు పోసి మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేవరకు చూడాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరి మొత్తం పోయాక కుక్కర్ మూత తీయాలి. అండుకొర్రల పాలక్ రైస్ రెడీ.. ఇప్పుడు పైనుంచి నిమ్మకాయ రసం పిండి కొత్తమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ రైస్‌ను వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. చల్లారిన తర్వాత అయితే గట్టిపడుతుంది.
అండుకొర్రల పాలక్ రైస్‌తో ప్రయోజనాలు
అండు కొర్రలలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, విటమిన్ బి3 పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తిని తగ్గించి, పెద్ద పేగు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి గుండె ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. మినరల్స్ ఎముకలను బలంగా ఉంచుతాయి. గ్లూటెన్ సమస్య ఉన్నవారికి, డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రోజూ మితంగా అండుకొర్రల పాలక్ రైస్ తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications