Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
బరువు తగ్గాలంటే బార్లీ వాటర్ తాగాలి..ఇంట్లోనే 5 నిమిషాల్లో దీనిని ఎలా చేసుకోవచ్చో చూడండి
బార్లీ వాటర్ తాగడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బార్లీ వాటర్ లో ఫైబర్, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్, మెగ్నీషియం, జింక్, కాపర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో దీనిని తాగడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయి. బార్లీ వాటర్ లో శరీర వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
బరువు తగ్గడంలో కూడా బార్లీ వాటర్ సహాయపడుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్ ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవవచ్చు. బార్లీ వాటర్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

బార్లీ వాటర్ తయరీకి కావాల్సిన పదార్థాలు
-బార్లీ గింజలు
-నీళ్లు
-తేనె
-పటిక బెల్లం
-నిమ్మరసం
బార్లీ వాటర్ తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో పావు కప్పు బార్లీ గింజలు వేసి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు పోసి 6 గంటలు నానబెట్టుకోవాలి.
-6 గంటల తర్వాత బార్లీ గింజలలోని నీళ్లు మొత్తం పారబోయండి.
-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో 3 కప్పుల నీళ్లు పోసి మరిగించుకోండి.
-నీళ్లు మరుగుతున్నప్పుడు బార్లీ గింజలను అందులో వేయండి.
-మీడియం మంట మీద 20 నిమిషాల సేపు ఉడికించుకోవాలి.
-తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి.
-పూర్తిగా చల్లారిన తర్వాత నీళ్లను వడగట్టుకోవాలి.
-వడకట్టిన నీళ్లల్లో రెండు స్పూన్లు తేనె లేదా పటిక బెల్లం వేసుకోండి.
-తర్వాత అందులోనే కొంచెం నిమ్మరసం పిండుకొని స్పూన్ తో కలుపుకుంటే బార్లీ వాటర్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications