Latest Updates
-
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్‌లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.! -
భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి.. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలు.! -
ఈ ప్రత్యేక మసాలాతో దిండిగల్ వెజ్ బిర్యానీ చేశారంటే..ప్రతి మెతుకు అమృతమే..మిగతావన్నీ మర్చిపోతారు! -
కళ్లకి కాటుక ఎలా పెట్టుకుంటున్నారు.?.. ఇలా అప్లై చేశారంటే కంటి కింద కురుపులు తప్పవు.!
దోశ, ఇడ్లీతో బోర్ కొట్టిందా..? అయితే ఈ బేసన్ చిల్లాను ట్రై చేయండి..10 నిమిశాల్లో రెడీ..!
ఎప్పుడూ రెగులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుంది. కేవలం మన టిఫిన్స్ మాత్రమే కాకుండా, నార్త్ ఇండియా వాళ్లు ఏమి తింటున్నారు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఏ టిఫిన్స్ ఫేమస్‌గా వున్నాయ్. అవి తెలుసుకొని మనం వారి స్టైల్లో చేసుకుంటే టేస్ట్‌తో పాటు మంచి అనుభూతి, థ్రిల్ వుంటుంది. దాని కోసమే మేము ఈ రోజు మీకు ఉత్తర భారతంలో ఫేమస్ రెసిపీ అయిన బేసన్ కా చిల్లా రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చామం. ఇందులో బేసన్ పిండి వుండడం వల్ల మంచి ప్రొటీన్ లోడెడ్ కంటెంట్ వుంటుంది.
దీన్ని తయారు చేయడానికి కూడా చాలాతక్కువ సమయం పడుతుంది. ఈ టిఫిన్‌ను పిల్లలకు కూడా సర్వ్ చేయోచ్చు వాళ్లు చాలా ఇష్టంగా తింటారు. ఇడ్లీ, దోశ, వడ లాంటివి చేయాలంటే చాలా సమయం పడుతుంది. అలాంటి సమయంలో దన్ని కేవలం 10 నిమిశాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ వంట పదార్ధాలు కూడా అవసరం లేదు. చాలా సింపుల్‌గా ఈజీగా చేసేసుకోవచ్చు.

బేసన్ కా చిల్లా తయారు చేయడానికి ఈ కింది వంట పదార్ధాలను సిద్ధం చేసుకోండి.
1 కప్పు బేసన్
1/2 టీస్పూన్ అజ్వైన్
1/2 టీ స్పూన్ ఉప్పు
తగినంత పసుపు
3 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయలు
3 టేబుల్ స్పూన్ల టయోటాలు
2 పచ్చిమిరపకాయలు
1 టీ స్పూన్ తురిమిన అల్లం
1 కొత్తిమీర కల్ల
నీళ్లు
2 టీ స్పూన్ల మంచి నూనె
బేసన్ కా చిల్లా రెసిపీని ఇలా కింది విధంగా రెడీ చేసుకోండి
1 ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటను బాగా కడగాలి. వీటిని సన్నగా కోసి ఒక ఇంచు అల్లం ముక్కను, కొన్ని కొత్తిమీర ఆకులను వేసుకోవాలి.
2. మిక్సింగ్ బౌల్‌లో 1 కప్పు బేసన్ పిండి, తగినంత ఉప్పు, అర టీ స్పూన్ అజ్వైన్, తగినంత పసుపు వేసుకోవాలి.
3. తరువాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటలు, అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వీసుకోవాలి.
4. కొత్తిమీర ఆకులు వేసి అందులో అరకప్పుకు పైగా నీళ్లు పోసుకోవాలి.
5. అవసరమైనన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. మరీ నీళ్లు ఎక్కువగా కాకుండా, మరీ తక్కువ కాకుండా చూసుకోవాలి. నీళ్లు తక్కువగా పోసి గట్టిగా కలపడం వల్ల అది తింటే కడుపునొప్పి వచ్చే అవకాశం వుంది.
6. మీ దగ్గర ఒక నాన్‌స్టిక్ ప్యాన్ వుంటే దాన్ని స్టవ్‌పైన పెట్టుకొని ఒక టీస్పూన్ నూనెను పోసి ప్యాన్‌పైన మొత్తం రాసుకోవాలి. తరువాత ప్యాన్ వేడయిన తరువాత ఒక గరిట నిండ పిండిని తీసుకొని దోశలాగా వేసుకోవాలి.
7. మీకు వీలయినంత సన్నగా దీన్ని ప్యాన్‌పైన వేసుకోవాలి. కొద్దిగా నూనె పోసుకొని అటూ ఇటూ తిప్పండి. బాగా కాలే వరకు దాన్ని గరిటతో ప్రెస్ చేయండి.
8. ఇక ప్యాన్‌పైన వున్న చీలా నెమ్మదిగా బ్రౌన్ కలర్‌లోకి మారిపోతుంది. అలా కాగానే ప్యాన్ పైనుంచి కిందకి దించేసుకోవాలి. దీంతో మీ చీలా రెసిపీ రెడీ అయినట్టే.
9. ఈ చీలా రెసిపీని ఏదైనా పచ్చడి, కొబ్బరి చట్నీ లేదంటే చాయ్‌లో కూడా నంచుకొని తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications