Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Chaddannam : ఈ వేసవిలో కడుపు చల్లగా శరీరం ఎనర్జిటిక్‌గా ఉండాలంటే చద్దన్నం తినాల్సిందే..
పెద్దల మాట చద్దన్నం మూట అనే సామెతను వినని వారు ఇంట్లో ఉపయోగించని తెలుగు వారు ఉండరు. చద్దన్నం ఎంత ఉపయోగకరమనేది ఈ సామెతలోనే ఉంది. ఆ చద్దన్నంను అసలెలా తయారు చేస్తారు వాటిలో ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి జనరేషన్‌కు చద్దన్నం గురించి తెలిసినే నేరుగా తినే అవకాశాలు చాలా తక్కువ. పూర్వం వ్యవసాయం చేసే వాళ్లు ఎక్కువగా ఈ చద్దన్నం మూటను పొలంలోకి తీసుకొని వెళ్లి తినేవారు. ఇప్పుడు చద్దన్నం చేసుకోవడం చాలా తగ్గింది. కానీ కొన్ని హోటల్స్ మెన్యూలో ఈ చద్దన్నాన్ని కూడా చూడవచ్చు.
చద్దన్నం తయారు చేసే విధానం
ఆరోగ్యానికి ఈ చద్దన్నం చాలా మంచిది. అమెరికన్లు కూడా ఈ చద్దన్నంపై మక్కువ చూపుతున్నారు. వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా వుంచుతుంది. దీనిని ప్రోబయోటిక్ ఫుడ్ క్యాటగిరీలో కూడా వేయవచ్చు. ఇక చద్దన్నం తయారీ గురించి తెలుసుకుందాం.
ముందుగా ఒక కప్పు బియ్యాన్ని కుక్కర్‌లో వేసి అందులో మూడు నుంచి నాలుగు కప్పుల నీళ్లతో రైస్‌ను వండుకోవాలి. చద్దన్నంను గంజి కావాలి కాబట్టి అదనంగా గంజికోసం మనం రైస్‌లో రెండు కప్పుల నీళ్లు ఎక్కువగా పోసుకుంటున్నాం. సాధారణంగా తినే రైస్‌కు ఒక కప్పు రైస్‌కు రెండు కప్పుల నీళ్లను పోస్తాము కానీ ఇక్కడ నాలుగు కప్పుల నీళ్లను పోస్తున్నాం.

మట్టిపాత్రలో కమ్మగా
అన్నం బాగా ఉడికిన తరువాత స్టవ్ మీద నుంచి కిందకు దించకొని గంజిని సెపరేట్ చేయాలి. ఇప్పుడు చద్దన్నం కలపడానికి ఓ మట్టిపాత్రను తీసుకోవాలి. మట్టపాత్రలో చద్దన్నం పెట్టుకుంటే రుచి మరింత కమ్మగా ఉంటుంది. ఒక బౌల్‌లో రైస్‌తీసుకొని మట్టిపాత్రలో వేసుకోవాలి. ఒక కప్పు గంజి తీసుకొని అన్నంలో వేయాలి. ఒక కప్పు వేడివేడి చిక్కటి పాలను కూడా పోసి కలుపుకోవాలి. పాలల్లో అన్నం పలచగా కలవడానికి మరికొన్ని పాలు కావాలంటే పోసుకోలి. అందులోని పాలు గోరువెచ్చగా ఉండాలి. ఎందుకంటే పెరుగువేసి కలిపితే అప్పుడు మాత్రమే సరిగ్గా తోడుకుంటుంది.
అన్నంలో పెరుగుతోడు పెట్టడానికి ఒక స్పూన్ పెరుగుతీసుకొని రైస్‌లో వేసి బాగా కలుపుకోవాలి. రైస్‌ను బాగా కిలిపి రైస్‌పైన ఐదు ఉల్లిపాయ ముక్కలను, ఐదు మిరపముక్కలను రైస్‌పైన వేసుకోవాలి. కానీ అందులో కలుపుకోకూడదు. తరువాత మట్టిపాత్రకు మూత పెట్టి 12 గంటల వరకు అలాగే ఉంచాలి.
అన్నం తోడుకోవాలి
12 నుంచి 15 గంటల తరువాత మట్టిపాత్రను ఓపెన్ చేస్తే చద్దన్నం పెరుగులో గట్టిగా తోడుకున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక ఒక ముద్దను నోట్లో పెట్టుకొని ఉల్లిపాయ, మిరపకాయను కొరికితే ఆ రుచిని మాటల్లో చెప్పలేము. మరింకెందుకు ఆలస్యం వేసవి వెళ్లిపోకముందే మీకు కవాలసినన్ని సార్లు ఈ బయోటిక్ ఫుడ్‌ను ప్రిపేర్ చేసుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications