Latest Updates
-
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
సాంబార్,పప్పుచారుకు బెస్ట్ కాంబినేషన్..కరకరలాడే కుర్ కురే బెండీ..ఎలా చేసుకోవాలంటే
బెండాకాయ తింటే లెక్కలు బాగా వస్తాయి..తెలివితేటలు పెరుగుతాయి అని పెద్దలు మన చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉంటారు. అయినా కూడా చాలామందికి బెండకాయ అంటే చాలు అబ్బా వేరే కూర లేదా అంటుంటారు. బెండకాయతో పులుసు,ఫ్రై,పచ్చడి వంటి రకరకాల వెరైటీలు తయారుచేస్తుంటారు. అయితే మీరెప్పుడైనా కుర్ కురే బెండీ తిన్నారా? స్నాక్‌గా లేదా సైడ్ డిష్‌గా దీనిని ఆస్వాదించవచ్చు. సాయంత్రం వేళ టీతో పాటు స్నాక్ గా తినడానికీ, పప్పుచారు లేదా సాంబార్ తో తినడానికీ కుర్ కురే బెండీ మంచి ఛాయిస్. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం.
పేరులో ఉన్నట్టుగానే ఇది కుర్ కురేలా కరకరలాడుతూ, బెండకాయ రుచిని ఇస్తుంది. కుర్ కురే బెండీ ఇంట్లో తయారు చేసుకోవడం ద్వారా బయటి స్నాక్స్ కంటే శుభ్రంగా,ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కుర్ కురే బెండీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-బెండకాయలు: 250 గ్రాములు
-శనగ పిండి: 3 టేబుల్ స్పూన్లు
-జీలకర్ర పొడి: 1 టేబుల్ స్పూన్
-కారం: 1 టీ స్పూన్ (మీ రుచికి తగ్గట్టు)
-పసుపు: 1/4 టీ స్పూన్
-చాట్ మసాలా: 1 టీ స్పూన్
-ఉప్పు: తగినంత
-నిమ్మరసం: 1 టీ స్పూన్
-ఆవనూనె: 1 టేబుల్ స్పూన్
-నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా లేత బెండకాయలను శుభ్రంగా కడిగి, పొడి గుడ్డతో తుడవాలి. వాటికి అస్సలు తడి ఉండకూడదు..లేకపోతే బెండకాయలు జిగటగా మారతాయి.
-బెండకాయల చివరలను కట్ చేసి ఒక్కో బెండకాయను నిలువుగా నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి. మధ్యలో ఉండే గింజలను తీసేయవచ్చు, అప్పుడు బెండకాయలు మరింత కరకరలాడతాయి.
-ఒక పెద్ద బౌల్ లో సన్నగా చీల్చుకున్న బెండకాయ ముక్కలను తీసుకోండి. అందులో శనగ పిండి, కారం, జీలకర్ర పొడి, పసుపు, చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవనూనె,అరచెక్క నిమ్మరసం కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం వేయడం వల్ల బెండకాయలు కరకరలాడడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక కడాయిలో లేదా డీప్ ఫ్రైయింగ్ పాన్ లో నూనెను వేసి బాగా వేడి చేయాలి. నూనె మరీ పొగలు వచ్చేంత వేడిగా ఉండకూడదు, కానీ వేడిగా ఉండాలి.
-నూనె వేడయ్యాక కొద్దికొద్దిగా బెండకాయ ముక్కలను వేసి మీడియం మంటపై గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకు, కరకరలాడేంత వరకు వేయించాలి. ఒకేసారి అన్నింటినీ వేయకుండా రెండు లేదా మూడు వాయిలుగా వేయిస్తే బాగా వేగుతాయి.
-వేగిన బెండకాయ ముక్కలను టిష్యూ పేపర్‌పై తీసి అదనపు నూనెను పీల్చుకోవడానికి అనుమతించాలి. వేడి వేడిగా వడ్డిస్తే కుర్ కురే బెండీ రుచిని సంపూర్ణంగా ఆస్వాదించవచ్చు.
-కుర్ కురే బెండీ రుచిగా ఉన్నప్పటికీ ఇది డీప్ ఫ్రై చేసిన వంటకం కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది. అధికంగా నూనెలో వేయించడం వల్ల కొన్ని పోషకాలు కోల్పోవచ్చు. అయితే బెండకాయలో ఉండే సహజమైన పోషకాలు మాత్రం శరీరానికి లభిస్తాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications