Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
పెరుగన్నం తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఆంధ్రా భోజనం అంటే రోజూ
కొంత పెరుగు ఉండాల్సిందే. మన తెలుగువారి భోజనంలో పెరుగన్నం పక్కాగా
ఉంటుంది. ఇక ఉత్తర భారతదేశంలో అయితే దీన్నే రైతా అంటారు. కానీ మనకు
పెరుగన్నంలో కూడా దద్దోజనం అనే ప్రత్యేక వంటకం ఉంది. దీన్ని మనం
ముఖ్యంగా దేవుడికి ప్రసాదాన్ని అర్పించడానికి చేస్తాము. దద్దోజనం ఎంత
రుచిగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ ఎండా కాలంలో దద్దోజనం తింటే
రుచికి రుచి, చల్లదనానికి చల్లదనం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇక
దద్దోజనాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో
తెలుసుకుందాం.
దద్దోజనం తయారు చేసే విధానం
1. దద్దోజనానిని ముఖ్మమైంది పెరుగు. కాబట్టి మంచి తియ్యని కమ్మనైన గడ్డ పెరుగును మాత్రమే దద్దజోనం తయారు చేయడానికి వాడదాం. మంచి బ్రాండెడ్ కంపెనీకి చెందిన పెరుగును ఓ అరకేజీ తీసుకోండి.
2. ప్రస్తుతం కేవలం ఇద్దరికి లేదా ముగ్గురికి సరిపడా దద్దోజనాన్ని చేసుకుందాం. కుక్కర్‌లో ఒక కప్పు రైస్‌ను తీసుకొని అందులో రెండు కప్పుల నీళ్లు పోసుకొని రెండు విజిల్స్ వచ్చేవరకు వుంచి తరువాత కుక్కర్‌ను కిందకి దించుకోవాలి.
3. అన్నం ఉడికిన తరువాత పప్పు గరిటెతో ఉడికిన అన్నాన్ని ఇంకా బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. కుదిరితే పప్పును రుబ్బే పప్పు గొట్టంతో అన్నాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.

4. ఇంతకు ముందు రైస్ వేయడానికి ఉపయోగించిన కప్పుతోనే కప్పున్నర పాలని అన్నంలో వేసి మెత్తగా కలుపుకోవాలి. కలిపిన అన్నం చల్లారేవరకు అలానే వుంచాలి.
5. ఇక రెండు కప్పుల కమ్మని గడ్డ పెరుగు తీసుకొని కుక్కర్‌లో వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. పెరుగు ఎంత కమ్మగా ఉండే దద్దోజనం అంత బాగా అవుతుంది. పెరుగును తీసుకునే ముందు ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే పెరుగు పెల్లగా ఉంటే దద్దోజనం మొత్తం పులిసిపోతుంది. వంట చేసే విధానంలోనే కాదు అందులో ఉపయోగించే పదార్ధాల వల్ల కూడా రుచి మారుతూ ఉంటుందన్న విషయం మనకు తెలిసిందే.
6. పెరుగువేసి మిక్స్ చేసిన రైస్‌ను ఒక బౌల్‌లోకి మార్చుకోవాలి. తాలింపు కోసం తాలింపు గిన్నెను స్టవ్ఱ పైన పెట్టుకోవాలి. తాలింపు గిన్నెలో ఒకటిన్నర టేబుల్ స్పూన్ మంచి నూనె వేసుకోవాల. అందులో ఒక టేబుల్ స్పూన్ పచ్చి చెనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒకటీ స్పూన్ మిరియాలు వేసి కలపాలి. రెండు నిమిషాల తరువాత తాలింపులో సన్నగా కోసిన అరస్పేన్ అల్లం, కోసిన రెండు పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిర్చి, కొంత కరివేపాకు వేసుకొని మొత్తం తాలింపును కలుపుకోవాలి.
7. తాలింపు కొంత చల్లబడిన తరువాత, ఇంతకు ముందు బౌల్‌లో తీసుకున్న పెరుగన్నంపై తీలింపును వేసుకోవాలి. మనకు ఎంత ఉప్పు అవసరమనుకుంటే అంత ఉప్పు వేసుకొని బౌల్‌లో ఉన్న పెరుగన్నం, తాలింపు, ఉప్పును బాగా కలుపుకోవాలి. దీంట్లో కొత్తి మీరను యాడ్ చేసుకుంటే దద్దోజనం తయారు చేయడం పూర్తయినట్టే.
ఈ దద్దోజనాన్ని చల్లగా తింటే చాలా బాగుంటుంది. కొద్ది సేపు ఫ్రిజ్‌లో పెట్టుకొని మనసారా కడుపునిండా ఆరగించండి. ఈ మండే ఎండలో కడుపును చల్లగా వుంచుకోండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications