Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
నాన్ వెజ్ కర్రీలకు ధీటుగా..దాభా స్టైల్ లో పసందైన పన్నీరు కర్రీ,ఎలా చేయాలంటే
చాలామందికి పన్నీరు అంటే పిచ్చి ఇష్టం ఉంటుంది. పన్నీరుతో తయారుచేసే వంటలను ఎగబడి తింటుంటారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాన్ వెజ్ ఇష్టపడేవాళ్లు,ఇటు వెజ్ ఇష్టపడేవాళ్లు ఇద్దరికీ ఇది ఫేవరెట్ వంటకం. పన్నీర్ కర్రీని అన్నం, రోటీ, నాన్ లేదా పులావ్ తో తింటే యమా రుచిగా ఉంటుంది. ముఖ్యంగా వెజిటేరియన్లకు ఇష్టమైన రుచికరమైన వంటకం పన్నీర్ కర్రీని వివిధ రకాలుగా తయారు చేయవచ్చు. దీనిని చాలా ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పన్నీరు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
పన్నీరు కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు
పన్నీర్: 250 గ్రాములు (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగినవి)
టమోటాలు: 2 (గుజ్జుగా చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: 1 టీ స్పూన్
ధనియాల పొడి: 1 టీ స్పూన్
గరం మసాలా: 1/2 టీ స్పూన్
పసుపు: 1/4 టీ స్పూన్
కారం: 1 టీ స్పూన్
కసూరి మేథీ: 1 టీ స్పూన్
క్రీమ్: 2 టేబుల్ స్పూన్లు
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: గార్నిష్ కోసం

తయారీ విధానం
-ముందుగా పన్నీర్ ముక్కలను కొద్దిగా ఉప్పు కలిపిన నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి. ఇది పన్నీర్ మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.
-తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేడి చేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
-తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం వేయించాలి.
చిక్కుడుకాయ కూరను ఇలా వండుకుంటే.. గిన్నెలో ముద్ద అన్నం లేకుండా ఊడ్చేస్తారు, ఎలా అంటే?
-ఇప్పుడు అందులో టమోటా గుజ్జు, పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి.
-పన్నీర్ ముక్కలు వేసి బాగా కలపి కొద్దిగా నీరు పోసి మూత పెట్టి 5-7 నిమిషాలు ఉడికించిన తర్వాత అందులో గరం మసాలా, కసూరి మేథీ వేసి కలపాలి.
-తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.
-గ్రేవీని మరింత చిక్కగా చేయడానికి కొద్దిగా జీడిపప్పు పేస్ట్ ను కలపవచ్చు. కొద్దిగా బటర్ లేదా నెయ్యిని కూడా వేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications