Latest Updates
-
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే!
గుడ్డుతో అదిరిపోయే స్వీట్ జన్మలో మర్చిపోలేని టేస్ట్,ఎలా చేసుకోవాలో తెలుసా?
చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ కొందరు వాటిని తినలేరు. దానికి ఆరోగ్యపరమైన కారణాలు కావొచ్చు, మరికొందరికి వేరే ఇతర సమస్యలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికీ స్వీట్స్ తినాలనే కోరిక మాత్రం ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఈ ఎగ్ స్వీట్ తినొచ్చు. ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ స్టోరీలో ఎగ్ స్వీట్ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది వివరించాము, తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు:
పాలు - 1 లీటరు
గుడ్లు - 6
చక్కెర - 200 గ్రాములు (పొడి చేసుకోవాలి)
నెయ్యి - తగినంత
బాదం - 100 గ్రాములు
కుంకుమపువ్వు - 1
వెనీలా ఎసెన్స్ - ఒక స్పూన్
యాలకుల పొడి - ఒక స్పూన్

తయారీ విధానం:
ఈ ఎగ్ స్వీట్ తయారు చేయడానికి ముందుగా ఒక లీటర్ పాలను కోవా మాదిరిగా పాకం వచ్చే వరకు బాగా మరించాలి. పాలు బాగా చిక్కగా తయారైనప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే నానబెట్టిన బాదం పప్పు, కప్పు పాలు కలిపి మెత్తగా చేసుకోవాలి.
ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో గుడ్లు పగలగొట్టి పోసుకోవాలి. దాంట్లోనే పొడి చక్కెర, కోవా, రుబ్బిన బాదం వేసి మిక్స్ చేసుకోవాలి. చివరగా వెన్నెల ఎసెన్స్, కుంకుమపువ్వు లేదా యాలకుల పొడి మిశ్రమాన్ని కూడా యాడ్ చేయాలి.
ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా అందులో వేసుకొని చిక్కగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని దానిలో వేసి చిక్కగా అయ్యే వరకు ఉడికించాలి. ఇప్పుడు కడాయిని పొయ్యి మీద వేసి, కొన్ని నిమిషాల పాటు వేడి చేయాలి. దానిలో ఒక రింగ్ ఉంచి, దానిపై ఈ ప్లేట్ ఉంచి, మూత పెట్టి 40 నుండి 45 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరువాత దించి చల్లారిన తరువాత వేరే ప్లేట్ కు మార్చి, ముక్కలుగా కోసి తినవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications